ఏపీలో మరో కీలక పోస్టింగ్..జగన్ ఓఎస్డీగా కృష్ణమోహన్ రెడ్డి

Update: 2019-05-30 14:34 GMT
నవ్యాంధ్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సీఎంగా నియమిస్తూ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ గెజిట్ నోటిఫికేషన్ చేశారు. మధ్యాహ్నం జగన్ చేత సీఎంగా ప్రమాణం చేయించిన గవర్నర్... సాయంత్రానికంతా జగన్ ను సీఎంగా అపాయింట్ చేస్తున్నట్లుగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇక అదే సమయంలో సీఎంగా పదవీ ప్రమాణం చేసిన మరుక్షణమే జగన్ దూకుడు పెంచేశారని చెప్పాలి.

సీఎంగా ప్రమాణం చేసిన వెంటనే తనకు అదనపు కార్యదర్శిగా ధనుంజయ్ రెడ్డిని నియమించుకున్న జగన్... ఆ వెంటనే తనకు ఓఎస్డీగా వ్యవహరించే అధికారిని కూడా ప్రకటించేశారు. జగన్ వద్ద ఓఎస్డీగా కృష్ణమోహన్ రెడ్డిని నియమితులయ్యారు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ కాసేపటి క్రితం ఉత్వర్లులు జారీ చేసింది. కృష్ణమోహన్ రెడ్డి పూర్తి వివరాలు తెలయరాలేదు గానీ... రాష్ట్ర సర్వీసులో ఆయన స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ గా పనిచేసి పదవీ విరమణ చేశారట. ఇంతకు మించి కృష్ణ మోహన్ రెడ్డి వివరాలేమీ తెలియరాలేదు.
Tags:    

Similar News