ఆ ఐఏఎస్‌, ఎమ్మెల్యే పెళ్లి చేసుకున్నారోచ్‌

Update: 2017-06-30 17:49 GMT
ఏకంగా ఐఎఎస్ నే ప్రేమలోకి దింపి సంచ‌ల‌నం సృష్టించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే తాజాగా ఓ ఇంటివారు అయ్యారు. కేరళకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే శబరినాథ్ తిరువనంతపురం సబ్ కలెక్టర్ దివ్య అయ్యర్ ప్రేమ వ్యవహారం కొద్దికాలం క్రితం బయటకు వచ్చిన సంగ‌తి తెలిసిందే. గత కొంత కాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరు ఈ విషయాన్ని వారే స్వ‌యంగా బహిర్గతం చేశారు. ఇరు వైపులా కుటుంబాలను ఒప్పించి వీరిద్దరు పెళ్ళి కూడా చేసుకున్నారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఎస్ శబరినాథన్ ఐఏఎస్ అధికారిణి దివ్యా ఎస్ అయ్యర్ ల వివాహం ఈ రోజు కన్యాకుమారి జిల్లాలోని తుక్కలేలో జరిగింది. ఇరువురి బంధు మిత్రుల సమక్షంలో నిరాడంబరంగా జరిగిన ఈ వివాహం గురించి పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. ఒక రాజకీయ నాయకుడు, సివిల్ సర్వీసెస్ అధికారిణి పెళ్లి చేసుకోవడం రాష్ట్రంలో ఇదే ప్రథమం. కాగా, దివ్య అయ్యర్ ని పెళ్లి చేసుకోబోతున్నట్లు ఎమ్మెల్యే శబరినాథ్ ఫేస్ బుక్‌ లో ప్రకటించారు. పరస్పరం తమ అభిప్రాయాలు, అభిరుచులు కలిసాయని, తమ పెద్దలు కూడా అంగీకరించడంతో పెళ్లి చేసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఐఏఎస్ - ఎమ్మెల్యే ప్రేమ వ్యవహారం కేరళతో పాటు దేశంలో కూడా హాట్ టాఫిక్ అయింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News