కేటీఆర్‌ కు బ‌ర్త్ డే విషెస్ ఇలానే చెప్పాల‌ట‌

Update: 2017-07-24 06:41 GMT
ప్ర‌తి సంద‌ర్భాన్ని ఇమేజ్ పెంచుకునేలా చేసుకునే తెలివి అంద‌రికి ఉండ‌ద‌నే చెప్పాలి.  ఎప్ప‌టిక‌ప్పుడు చుట్టూ ఉన్న ప‌రిస్థితుల్ని ప‌రిశీలిస్తూ.. కాలానుగుణంగా వ‌స్తున్న మార్పుల‌కు త‌గ్గ‌ట్లుగా తాము మారుతున్నామ‌న్న సంకేతాల్ని ఇచ్చేలా వ్య‌వ‌హ‌రించే వైనం కొంద‌రు నేత‌ల‌కు మాత్ర‌మే ఉంటుంది. అలాంటి తెలివైన నేత‌గా తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కుమారుడు.. తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ను చెప్పాలి.

ఈ రోజు ఆయ‌న పుట్టిన‌రోజు. అధికార‌పార్టీకి సంబంధించి అతి కీల‌క‌మైన వ్య‌క్తిగా.. అన‌ధికారికంగా సీఎం కేసీఆర్ రాజ‌కీయ వార‌సుడిగా గుర్తింపు పొందిన కేటీఆర్ పుట్టిన‌రోజు అంటే హ‌డావుడి ఎంత‌లా ఉంటుందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అయితే.. త‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా పెద్ద ఎత్తున ఉండే హ‌డావుడిని గుర్తించిన కేటీఆర్‌.. అలాంటి వాటికి చెక్ పెట్టేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని చెప్పాలి.

త‌న‌కు బ‌ర్త్ డే విషెస్ చెప్పాల‌నుకునే వారు బొకేలు.. కేకులు వెంట తీసుకొని రాకుండా ఒక పూల‌మొక్క‌ను తీసుకురావాల‌ని చెప్ప‌టం ద్వారా.. త‌న వేడుక‌లతో అంద‌రి మ‌న‌సుల్ని దోచుకునేలా ప్లాన్ చేశార‌నిచెప్పాలి. ఆడంబ‌రాల‌కు.. హ‌డావుడి ఇప్ప‌టి త‌రానికి ఏ మాత్రం న‌చ్చని వేళ‌లో.. అలాంటి వాటికి దూరంగా ఉండ‌టం ద్వారా త‌న‌ను తాను ఫ్యూచ‌ర్ పొలిటీషియ‌న్ గా కేటీఆర్ త‌న చేత‌ల‌తో ఫ్రూవ్ చేసుకుంటున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇదిలా ఉంటే.. కేటీఆర్ బ‌ర్త్ డే విషెస్ హ‌డావుడి నిన్న రాత్రి నుంచే షురూ అయిన‌ట్లుగా తెలుస్తోంది.

విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం.. కేటీఆర్ త‌న స‌న్నిహితుల‌తో క‌లిసి గండిపేట‌లో బ‌ర్త్ డే పార్టీ చేసుకున్న‌ట్లుగా చెబుతున్నారు. కేటీఆర్ కు అత్యంత స‌న్నిహితులు ఈ పార్టీకి హాజ‌రైన‌ట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. కేటీఆర్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆయ‌న్ను కీర్తించేలా ఒక పుస్త‌కాన్ని ఆయ‌న సోద‌రి క‌విత చేతుల మీదుగా రిలీజ్ చేయ‌టం మ‌రో విశేషంగా చెప్పాలి.

Tags:    

Similar News