జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో మెజారిటీ సాధించేది తామేనని, మాకు పోటీ బీజేపీ - టీడీపీయేనని, కాంగ్రెస్ కు సింగిల్ డిజిట్ కూడా రాదని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ లోనే కాదు.. ఇప్పుడు చాలామంది విశ్లేషకుల్లో ఇదే భావన వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ కు వేసే ప్రతి ఓటూ వృథాయేనని వారంతా వ్యాఖ్యానిస్తున్నారు. ఇందుకు కారణాన్నీ చెబుతున్నారు.
జీహెచ్ ఎంసీ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగరేయాలంటే 103 సీట్లు కావాలి. ఎక్స్ అఫీషియో రూపంలో కాంగ్రెస్ కు ఇప్పటికే ఏడు సీట్లు ఉన్నాయి. అంటే ఇంకా 97 సీట్లు కావాలి. అంటే గ్రేటర్ లోని మొత్తం 150 డివిజన్లలో 97 డివిజన్లను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటే గ్రేటర్ పీఠంపై సొంతంగా జెండా ఎగరేయగలుగుతుంది. ఒకవేళ కాంగ్రెస్ కు పాతికో ముప్పైయ్యో తక్కువ వచ్చినా.. ఆ పార్టీ పాలక మండలిని ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. గతంలో మజ్లిస్ తో ఆ పార్టీ పొత్తు పెట్టుకుంది. ఇప్పుడు మజ్లిస్ అధికార పార్టీ వైపు చూస్తోంది. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే పరిస్థితులు లేవు. టీడీపీ, బీజేపీ కూటమి కాంగ్రెస్ తో కలిసే పరిస్థితులు లేవు. అంటే సొంతంగా మెజారిటీ వస్తే తప్ప కాంగ్రెస్ గ్రేటర్ పీఠంపై జెండా ఎగరేయలేదు. ఆ పార్టీకి ఎన్నికల్లో 97 డివిజన్లు వచ్చే పరిస్థితులు అసలే లేవు. గత ఎన్నికల్లోనే వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే ఆ పార్టీకి 40 డివిజన్లకు మించలేదు. ఇప్పుడు సీమాంధ్రుల నుంచి ఆ పార్టీకి ఒక్క ఓటు కూడా పడే పరిస్థితి లేదని, తెలంగాణవాదులు కూడా కాంగ్రెస్ ను పూర్తిస్థాయిలో ఆదరించే పరిస్థితి లేదని, ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ సింగిల్ డిజిట్ దాటడం కష్టమేనని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇప్పుడు కాంగ్రెస్ కు అంతర్గత కుమ్ములాటలు ప్రధాన అవరోధంగా మారాయని చెబుతున్నారు. గ్రేటర్ పరిధిలో మొత్తం అధికారాన్ని తనకు ఇవ్వాలని దానం నాగేందర్ కోరితే, రంగారెడ్డి నేతలు అందుకు ససేమిరా అన్నారు. కాంగ్రెస్ లోనే ఏకాభిప్రాయం లేనప్పుడు ఆ పార్టీకి వేసిన ఓటు వృథా అవుతుందని, అందుకే టీఆర్ఎస్ కు పోటీగా తమను ఆదరించాలని టీడీపీ, బీజేపీలు ప్రచారం చేస్తున్నాయి. ఇందుకు మంచి ఆదరణ వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.