కరోనా వేళ.. లాక్ డౌన్ పుణ్యమా అని ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. మారే కాలానికి తగ్గట్లే మార్పులు చాలానే చోటు చేసుకుంటాయి. అందునా మగాళ్లకు ఉండే తిప్పలు అన్ని ఇన్ని కావు. ఒక వయసు వచ్చాక రెండు.. మూడు రోజులు సాగితే చాలు.. గడ్డాలు.. మీసాలు పెరిగి పోతుంటాయి. వారానికి ఒకసారైనా షేవింగ్ చేయించుకోకపోతే చాలా అసౌకర్యంగా ఉంటుంది. రెండు.. మూడు వారాలకు ఒకసారి.. కనీసం నెలలో తప్పనిసరిగా ఒక్కసారైనా జుట్టును కట్ చేయించుకోకపోతే ఇబ్బందే.
లాక్ డౌన్ పుణ్యమా అని..ఇళ్లల్లోనే ఉండిపోయిన మగాళ్లలో చాలా మందికి గడ్డాలు..మీసాలే కాదు.. తల మీద జుట్టు పెరిగిపోతోంది. లాక్ డౌన్ ఎత్తేసినా ఎత్తేయకున్నా.. సెలూన్లకు అనుమతి ఇస్తే బాగుంటుందన్న రిక్వెస్టులు పెరిగి పోతున్నాయి. అయితే.. క్లోజ్ కాంటాక్టు ఎక్కువగా ఉండే సెలూన్లు ఇప్పుడున్న పరిస్థితుల్లో తెరవకూడదన్న మాట వినిపిస్తోంది.
ఇలాంటివేళ.. తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కు ఆసక్తికర ట్వీట్ చేశారో నెటిజన్. కేటీఆర్ సర్.. ఏప్రిల్ 20న ప్రకటించే లాక్ డౌన్ సడలింపులో సెలూన్లు తెరిచే అవకాశం ఉందా? లేదంటే.. నా భార్యే తన హెయిర్ కట్ చేస్తానని చెబుతోంది. అదే జరిగితే.. లాక్ డౌన్ తర్వాత కూడా ఇంట్లో నుంచి రాలేనంటూ తన ఇబ్బందిని సరదాగా ట్వీట్ రూపంలో చెప్పుకొచ్చారు. దీనిపై స్పందించిన కేటీఆర్ అంతే ఫన్నీగా రియాక్ట్ అయ్యారు
క్రికెటర్ విరాట్ కోహ్లీ తన భార్యకు హెయిర్ స్టయిల్ చేసే అవకాశాన్ని ఇచ్చారు. మీరెందుకు ఇవ్వకూడదంటూ ట్వీట్ చేశారు. సరదాగా ఉన్న ఈ సంభాషణ నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. మొత్తానికి ట్వీట్ పెట్టిన మహానుభావుడి సతీమణి కేటీఆర్ మాటతో మరేం చేస్తారో?