తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను గెలిపించేందుకు రెండు నెలలుగా తీవ్రంగా శ్రమించిన కేటీఆర్ ఎట్టకేలకు రిలాక్స్ అయ్యాడు. తెలంగాణలో అధికారం చేపట్టగానే కేసీఆర్.. తన కుమారుడికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టి జిల్లాల పర్యటనలకు పంపారు. ఇప్పుడు ఆ పని కూడా అయిపోవడంతో తన కుటుంబంతో కలిసి కేటీఆర్ దుబాయ్ పర్యటనకు వెళ్లారు. తన బిజీ షెడ్యూల్ నుంచి కాస్త సమయాన్ని కుటుంబానికి కేటీఆర్ కేటాయించారు.
కేటీఆర్ తన కూతురు అలేఖ్య పుట్టినరోజును ఘనంగా జరుపుకోవడానికి భార్య షాలిమా, కొడుకు హిమాన్షుతో కలిసి దుబాయ్ లో వెళ్లారు. దుబాయ్ లోనే కూతురు అలేఖ్య పుట్టిన రోజు వేడుకలను జరుపుకోనున్నారు. కొద్దిరోజులు దుబాయ్ లోనే తన సమయాన్ని కుటుంబానికి వెచ్చించేందుకు కేటీఆర్ సిద్ధిమయ్యారు.
అప్పట్లో వచ్చిన భారత్ అనే నేను సినిమా ప్రమోషన్ లో కూడా కేటీఆర్ రాజకీయాల వల్ల తన కుటుంబానికి ఎక్కువ సమయం ఇవ్వలేకపోతున్నట్టు వాపోయారు. మహేష్ బాబు తన భార్య పిల్లలతో కలిసి సెలవులు దొరికినప్పుడల్లా హాలీడేస్ కు వెళతాడని తన భార్య షాలిమా పోరుపెడుతుందని.. మహేష్ ఎంతైనా అదృష్టవంతుడంటూ అప్పట్లో కేటీఆర్ చెప్పాడు. తను ప్రజాజీవితంలో ఉండడం వల్ల కుటుంబానికి సమయం వెచ్చించలేకపోతున్నట్టు కేటీఆర్ చెప్పుకొచ్చాడు. కానీ భవిష్యత్ లో తప్పకుండా భార్యపిల్లలను విదేశాలకు టూర్ కు తీసుకెళతానని మహేష్ కు కేటీఆర్ హామీనిచ్చాడు. ఇప్పుడు ఆ హామీని నెరవేర్చాడు.
తెలంగాణ ఎన్నికల్లో గెలిచి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక కాస్త వీలు చూసుకొని కుటుంబానికి తన సమయాన్ని ఇచ్చాడు కేటీఆర్. మూడు నాలుగు రోజులు దుబాయ్ లో ఉండి ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని కేటీఆర్ భావిస్తున్నారు.