తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు - రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మంత్రిగా - పార్టీ ముఖ్యనేతగా ఆయన ఎంత పాపులరో...సోషల్ మీడియాలో ట్విట్టర్ ద్వారా అంటే పాపులర్. ట్విట్టర్ వేదికగా తన కార్యక్రమాలు వివరాలు..ఇతరత్రా అంశాలను పంచుకోవడమే కాదు...అనేక ప్రజా సమస్యలకు సైతం ఆయన పరిష్కారం చూపుతుంటారు. ముఖ్యంగా ఆపదలో ఉన్నానంటే..వెంటనే ఆదుకుంటారు.
తాజాగా మంత్రి కేటీఆర్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ట్విట్టర్ వేదికగా ఓ వ్యక్తి అడిగిన సాయానికి వెంటనే ముందుకొచ్చారు. గంటల వ్యవధిలో ప్రాణాలు కాపాడే నిర్ణయం తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. డిసెంబర్ 5న ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తన స్నేహితుడు బల్వీందర్ కు తీవ్ర గాయాలయ్యాయని రోహిత్ మహంకాళి అనే వ్యక్తి ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఎల్ బీనగర్ లోని గ్లోబల్ ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారని, మెదడులో రక్తం గడ్డకట్టిందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు రూ.8లక్షల వరకు ఖర్చయ్యిందని, దాతలెవరైనా సాయం చేయాలని అభ్యర్థిస్తూ కేటీఆర్ కు ట్వీట్ చేశారు. దాన్ని చూసిన కేటీఆర్ వెంటనే స్పందించారు.
గాయపడిన బల్వీందర్ సింగ్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుని ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.2లక్షలు మంజూరు చేయించారు. ఇదంతా కేవలం గంటన్నర వ్యవధిలో జరగడం గమనార్హం. దీంతో పాటుగా ఈ విషయాన్ని తెలుపుతూ ట్వీట్ చేశారు. మంత్రి కేటీఆర్ సాయానికి రోహిత్ మహంకాళి ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశాడు. ఇలా వెంటనే స్పందించి ఆదుకోవడం మంత్రి కేటీఆర్ కే సాధ్యమని పలువురు అంటున్నారు.