ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తరచుగా తన ఖాతాలో వేసుకునే అంశం ``హైటెక్ సిటీకి నేనే బీజం వేశాను..సైబర్ టవర్స్‌కు నా వల్లే బీజం పడింది..సైబరాబాద్ నా సమర్థతకు నిదర్శనం` అని. వాస్తవానికి సైబర్ టవర్స్ కు శంకుస్థాపన చేసింది మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అనే విషయం అతి కొద్ది మందికే తెలుసు. ఎందుకంటే..బాబు ప్రచారం రేంజ్ అలాంటిది మరి!. చంద్రబాబు హయాంలో సైబర్‌బాద్ రూపురేఖలు మారిపోయాయనే ప్రచారంలో వాస్తవం లేదంటారు. కేవలం భవనాలు నిర్మాణాలకు మాత్రమే ఆయన ఓకే చేశారు..కానీ కీలక అంశాలైన మురుగునీరు పోయే వ్యవస్థ లేదు, మంచినీటి లభ్యత గురించి సైబరాబాద్ నిర్మాణం సమయంలో శ్రద్ధ పెట్టలేదు వంటి ఆరోపణలు ఉన్నాయి.
రకరకాల వాదనలు ఎలా ఉన్న బాహ్య ప్రపంచాని చెందిన మెజార్టీ ప్రజల దృష్టిలో మాత్రం బాబు హైదరాబాద్ కోసం బాబు ఎంతో చేశాడు అనే భావన ఉంది. అలాంటి భావనను తొలగించేందుకు సైబరాబాద్ రూపును మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం తనదైన శైలిలో పలు నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే పలు చర్యలు తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో అడుగు వేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, రాష్ట్ర ఐటీ - మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఈ క్రమంలో దేశంలోనే ఓ రికార్డ్ సృష్టించారు. బాబు క్లెయిం చేసుకునే హైటెక్ టవర్స్ కూతవేటు దూరంలోనే దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ నగరంలో ఏసీ బస్టాప్ లను ఇవాళ ప్రారంభించారు. శిల్పారామంకు ఎదురుగా అత్యాధునిక సదుపాయాలతో కూడిన ఏసీ బస్ షెల్టర్ ను కేటీఆర్ ప్రారంభించి.. ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఈ ఏసీ బస్ షెల్టర్ లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రత్యేకంగా బేబీ ఫీడింగ్ రూమ్ ను ఏర్పాటు చేశారు. ఆ గదిలో ప్రత్యేకంగా రెండు కుర్చీలను పొందుపరిచారు. అంతే కాకుండా పిల్లలకు కావాల్సిన సామాగ్రిని ఉంచారు. ఈ బేబీ ఫీడింగ్ రూమ్.. బాలింతలకు ఎంతోగాను ఉపయోగపడనున్నాయి. రద్దీ ఉండే ప్రాంతాల్లో బాలింతలు పడే అవస్థలు అందరికి తెలిసిందే. బాలింతల సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఏసీ బస్టాపుల్లో ప్రభుత్వం ప్రత్యేకంగా బేబీ ఫీడింగ్ రూమ్స్ ను ఏర్పాటు చేసింది. నగరంలోని మరిన్ని ప్రాంతాల్లో ఏసీ బస్టాపులను ఏర్పాటు చేస్తున్నారు. త్వరలోనే మిగతా ఏసీ బస్టాపులు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది.