తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ను నియమిస్తూ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.. కేటీఆర్ కు కీలక పదవి దక్కడం పై టీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యే, ఎంపీలు కలిసి అభినందనలు తెలుపుతున్నారు. అభిమానులు, పార్టీ కార్యకర్తలు, నేతలు శుభాకాంక్షలు చెప్పారు.
కేసీఆర్ ఈ ఉదయం తాను జాతీయ రాజకీయాల పై దృష్టి సారించేందుకు వీలుగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా తన కుమారుడు కేటీఆర్ ను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. టీఆర్ఎస్ చరిత్రలోనే తొలిసారి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని సృష్టించి కేటీఆర్ కు అప్పగించడం విశేషం. దీంతో మొత్తం గులాబీ పార్టీని కేటీఆర్ చేతిలో పెట్టినట్టు అయ్యింది. తాను తెలంగాణ పాలనతోపాటు ఢిల్లీ రాజకీయాల వైపు అడుగులు వేయనున్నట్టు కేసీఆర్ ఒక ప్రకటనలో ప్రకటించారు. పార్టీని నడిపించే బాధ్యతను కొడుకుకు అప్పగించారు. సభ్యత్వ నమోదు, జిల్లాలో పార్టీ కార్యలయాల నిర్మాణాలు, సంస్థాగతంగా పార్టీ బలోపేతం బాధ్యతలు కేటీఆర్ తీసుకోనున్నారు. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియామకం కావడంపై అసదుద్దీన్, టీఆర్ఎస్ నేతలు శుభాకాంక్షలు చెప్పారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తాను కృషి చేస్తానని కేటీఆర్ పేర్కొన్నారు. శుక్రవారం నిర్వహించే టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి కేసీఆర్ అధ్యక్షతన వహిస్తుండగా.. వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ హాజరు కానున్నారు.
* కేటీఆర్ కు హరీష్ రావు ట్విట్టర్ లో శుభాకాంక్షలు
టీఆర్ఎస్ లో కేసీఆర్ తర్వాత బలమైన ప్రజాదరణ కలిగిన నేతగా ఉన్న హరీష్ రావు తాజాగా కేటీఆర్ నియామకంపై స్పందించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన కేటీఆర్ కు హరీష్ రావు ట్విట్టర్ లో శుభాకాంక్షలు చెప్పారు. దీనికి ప్రతిగా కేటీఆర్ స్పందిస్తూ ‘చాలా థ్యాంక్యూ బావా’ అని అభిమానం చాటుకున్నారు..
*హరీష్ రావు ఇంటికి స్వయంగా వెళ్లిన కేటీఆర్
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియామకమైన కేటీఆర్.. తనకు పార్టీలో పోటీ అని అందరూ భావిస్తున్న బావ, సీనియర్ నేత హరీష్ రావు ఇంటికి మధ్యాహ్నం వెళ్లారు. ఈ సందర్భంగా హరీష్.. కేటీఆర్ ను సాదరంగా ఆహ్వానించి హత్తుకున్నారు. అనంతరం ఇద్దరూ అప్యాయంగా మాట్లాడుకున్నారు. తామిద్దరి మధ్య విభేదాలు లేవని వీరి భేటితో నిరూపితమైంది. అనంతరం కేకే ఇంటికి కూడా వెళ్లిన కేటీఆర్ ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ భేటిలతో కేటీఆర్ నియామకాన్ని హరీష్ రావు సమర్ధించినట్టైంది.
* కేటీఆర్ ను స్వాగతిస్తున్నా.. : హరీష్ రావు
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ నియామకంపై హర్షం వ్యక్తం చేస్తున్నట్టు హరీష్ రావు మీడియాకు తెలిపారు. తన ఇంటికి వచ్చిన కేటీఆర్ కలిసి వెళ్లిన అనంతరం హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. ఇటీవల పార్టీ ఎన్నికల్లో తామిద్దరం కలిసి ప్రచారం చేసి టీఆర్ఎస్ ను గద్దెనెక్కించామని.. భవిష్యత్తులోనూ తామిద్దరం కలిసి పనిచేస్తామని హరీష్ రావు చెప్పుకొచ్చారు. మేం ఇద్దరం కలిసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని.. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కలిసి పనిచేస్తామని హరీష్ రావు చెప్పారు..
ఇలా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి గులాబీ పార్టీలో అసమ్మతి రాజేస్తుందని అంతా భావించారు. కానీ కేటీఆర్ స్వయంగా హరీష్ రావు, కేకే ల ఇంటికి వెళ్లి అసమ్మతి, అసంతృప్తులకు తావులేకుండా వారితో సహృద్భావ వాతావరణంలో మాట్లాడారు. కేటీఆర్ నియామాకాన్ని హరీష్ రావు కూడా స్వాగతించడంతో టీఆర్ఎస్ లో పొరపొచ్చాలకు ఆస్కారం లేకుండా పోయింది.