తెలంగాణ తెలుగుదేశం పార్టీ రథసారథిగా ఓ వెలుగువెలిగి తెలంగాణలో పార్టీ ఆదరణ కోల్పోతుండటంతో అధికార టీఆర్ ఎస్ లో చేరిన సీనియర్ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావుకు అలకపాన్పు ఎక్కారా? ఏడాదిగా తనకు గౌరవం దక్కడం లేదు సరికదా పరాభవాలు ఎదురవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారా? ఎర్రబెల్లి అసంతృప్తిని తగ్గించేందుకు సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్ రంగంలోకి దిగారా? అంటే వీటన్నింటికీ అవుననే సమాధానం వస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఎర్రబెల్లి దయాకరరావును ఆయన ఇంటివద్ద కేటీఆర్ కలుసుకున్నారు. ఈ సమయంలో ఎర్రబెల్లితో పాటు టీడీపీ తరఫున గెలిచి టీఆర్ ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలూ ఉన్నారు.
మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని అధికారపార్టీ తరపున నుండి హామీ లభించడంతో ఎర్రబెల్లి టీడీపీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్ పార్టీలో చేరినట్టు ప్రచారం జరిగింది. ఆ విషయాన్ని అటు అధికార పార్టీ నేతలు గానీ, గులాబీ కండువా కప్పుకున్నవారు గానీ కొట్టిపారేయలేదు. ఆరునెలల్లో మంత్రి పదవిని కట్టబెడతామని చెప్పినట్టు తెలిసింది. అయితే ఏడాది దాటినా పట్టించుకోకపోవడంతో ఎర్రబెల్లి అలక పాన్పు ఎక్కినట్టు తెలిసింది. కలిసిన వాళ్లంతా ఏమైంది మంత్రి పదవి అని అడుగుతుండడంతో ఆయన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు కూడా వచ్చేందుకు ఆసక్తి చూపలేదని తెలిసింది. తన తల్లి మరణంతో దయాకరరావు పూర్తిస్థాయిలో సమావేశాలకు హాజరుకాలేకపోయారని అధికారపార్టీ నేతలు చెబుతున్నా దానికి వేరే కారణం ఉందని తెలుస్తోంది. ఇటీవల టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు రమణను కలిసినప్పుడు తన అసంతృప్తిని ఎర్రబెల్లి వ్యక్తం చేసినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మారి తప్పు చేశానా అన్న భావనను సన్నిహితుల వద్ద వాపోయినట్టు తెలిసింది. అది గులాబీ కండువా కప్పుకున్న మిగతా ఎమ్మెల్యేల్లోనూ ఉండడం గమనార్హం.
ఈ నేపథ్యంలోనే అందరికీ పదవులు కట్టబెడుతూ తనను దూరం పెట్టడం పట్ల ఎర్రబెల్లి ఆగ్రహంగా ఉన్నారని తెలిసింది. ఈ అసంతృప్తి ఆనోటా ఈ నోటా టీఆర్ ఎస్ అదిష్టానం వద్దకు చేరింది. మంత్రి కేటీఆర్ ఎర్రబెల్లిని కలుసుకుని 'మీ గౌరవాన్ని తగ్గకుండా చూసుకుంటాం' అని భరోసా ఇచ్చినట్టు తెలిసింది. కేటీఆర్ మాటతో మళ్లీ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణపై చర్చ నడుస్తున్నది. జూన్ రెండు తర్వాత మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు ఉండొచ్చని అంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/