గవర్నర్ భేటీ వెనుక సీక్రెట్ చెప్పిన కేటీఆర్

Update: 2019-08-01 04:47 GMT
తండ్రి షురూ చేసింది కొడుకు కంటిన్యూ చేస్తున్నారుగా అన్న మాట ఇటీవల కాలంలో రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. దేశంలోని మరే రాష్ట్రంలో లేని రీతిలో రాష్ట్ర గవర్నర్ ను అదే పనిగా ముఖ్యమంత్రి కలిసే వైనం తెలంగాణలో కనిపిస్తూ ఉంటుంది.

తరచూ గవర్నర్ నివాసానికి వెళ్లే కేసీఆర్.. గవర్నర్ తో గంటల కొద్దీ భేటీ అవుతుంటారు. అదేమన్న మాట అడగకముందే.. ప్రభుత్వ నిర్ణయాల్ని ఆయనతో చర్చించినట్లుగా చెబుతారు. ప్రభుత్వాధినేతగా గవర్నర్ తో అన్ని విషయాల్ని అన్నేసి గంటలు  మరెక్కడా చర్చించరు కదా?  తెలంగాణలోనే ఎందుకన్న సందేహానికి సమాధానాలు చెప్పేవారెవరూ కనిపించరు.

ఇదిలా ఉంటే.. ఈ మధ్యన గవర్నర్ తో తరచూ భేటీ అవుతున్నారు కేటీఆర్. మంత్రిగా ఉండి ఉన్నా అదో పద్ధతి. అధికారపార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్న కేటీఆర్.. గవర్నర్ తో తరచూ సమావేశం అవుతున్నది ఎందుకన్నది ఆసక్తికరంగా మారింది. తాజాగా రాజ్ భవన్ వెళ్లిన కేటీఆర్.. ఏకంగా గంటకు పైనే గవర్నర్ తో సమావేశం కావటం గమనార్హం. 

మర్యాదపూర్వకంగా గవర్నర్ ను కలిసినట్లుగా చెప్పారు కేటీఆర్. తరచూ భేటీ కావటం వెనుక కారణాన్ని వెల్లడిస్తూ.. గవర్నర్ తనకు తండ్రి లాంటి వారని.. అందుకే తరచూ కలుస్తానని చెప్పటం విశేషం. మొత్తానికి గవర్నర్ భేటీకి సంబంధించి కేటీఆర్ ఊహించని రీతిలో విషయాన్ని చెప్పారని చెప్పక తప్పదు.  మరి ఇంతటి  అనుబంధం ఎంతకాలం ఉంటుందో? అన్నట్లు.. ఇటీవల కాలంలో గవర్నర్ తో భేటీల్ని కేసీఆర్ తగ్గించటానికి కారణం ఏమై ఉన్నట్లు?
Tags:    

Similar News