మొట్టమొదటిసారిగా దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరయ్యేందుకు వెళ్లిన తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పెట్టుబడుల ఆకర్షణకు తన ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నారు. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో పాల్గొంటున్న మంత్రి కేటీఆర్ రెండో రోజు పలు ప్రముఖ కంపెనీలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశాల్లో అయా కంపెనీలను తెలంగాణలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరారు. తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక విధానం, తెలంగాణలోని పెట్టుబడుల అనుకూల వాతావరణాన్ని మంత్రి వారికి వివరించారు.
ఏయిర్ ఏషియా గ్రూప్ సియివో అంతోనీ ఫెర్నాండెస్ - ఉప కార్యనిర్వహానాధికారిణి ఏయిరీన్ ఒమర్ తో మంత్రి సమావేశం అయ్యారు. దేశంలో రానున్న రోజుల్లో విమానయాన రంగం మరింత అభివృద్ది చెందుతుందన్నారు. హైదరాబాద్ లోని విమానాశ్రయం అంతర్జాతీయ స్థాయిలో అనేక అవార్డులు గెలుచుకున్నదని తెలిపారు. నోవార్టిస్ కంపెనీ పబ్లిక్ పాలసీ హెడ్ పెట్రా లక్స్ తో మంత్రి సమావేశం అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ఫార్మాసిటీ గురించి వివరించారు. నగరం ఇప్పటికే భారతదేశ లైఫ్ సైన్సెస్ క్యాపిటల్ గా ఉన్నాదన్నారు. నగరంలో నొవార్టిస్ కార్యకలాపాల విస్తరణపైన ఈ సమావేశంలో చర్చ జరిగింది. నోవార్టిస్ కు నగరంలో అర్ అండ్ డి - డాటా సపోర్ట్ మరియు అనాలిటిక్స్ కార్యకలాపాలు కొనసాగిస్తున్నదని, హైదరాబాద్ నగరంలో సంస్ధ అభివృద్ది పట్ల తాము సంతృప్తిగా ఉన్నామని లక్స్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న 90 వేల చదరపు అడుగుల ల్యాబోరేటరీని రెట్టింపు చేయనున్నట్లు, కొత్తగా సుమారు మరో 150 మంది పరిశోధన సిబ్బందిని నియమించుకోనున్నట్లు తెలిపారు. కంపెనీ కార్యకలాపాల విస్తరణ ద్వారా నగరంలోని జినోమ్ వ్యాలీ అభివృద్దికి ఎంతగానో దోహదం చేస్తుందని, పూర్తి వివరాలను నోవార్టిస్ త్వరలోనే అందిస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు.
మిత్సుబిషి హెవీ ఇండస్ర్టీస్ కార్యనిర్వహాక ఉపాద్యక్షులు కెన్ కవాయి బృందంతో సమావేశం అయ్యారు. తమ కంపెనీ భారీ ప్రాజెక్టుల అవకాశాల కోసం చూస్తుందని మంత్రికి వారు తెలిపారు. ముఖ్యంగా పారిశ్రామిక వాడలు - వేస్ట్ మేనేజ్ మెంట్ ప్రాజెక్టులు తదితర ప్రాజెక్టులపైన మిత్సుబిషికి ఆసక్తి ఉన్నట్లు తెలిపారు. ఇలాంటి ప్రాజెక్టుల నిర్మాణానికి తమ రాష్ర్టంలో అనేక అవకాశాలున్నాయని, కంపెనీ ప్రతినిధి బృందం స్వయంగా తెలంగాణలో పర్యటించాలని మంత్రి కోరారు. మిత్సుబిషి ముందుకు వచ్చి జపనీస్ స్మాల్ అండ్ మిడియం ఎంటర్ ప్రైజేస్ పార్క్ ను తెలంగాణలో ఏర్పాటు చేయాలని కోరారు. మెన్నటి జపాన్ పర్యటనలో ఇలాంటి పార్కు ఎర్పాటుకు జైకా వంటి అర్ధిక సంస్ధలు నిధులు అందించేందుకు సూత్రప్రాయంగా ఒప్పుకున్నాయని మంత్రి వారికి తెలిపారు.
కువైట్కు చెందిన ఫవద్ అల్గానిమ్ కంపెనీ సీఈఓ మహ్మమద్ అల్గానిమ్ తో మంత్రి సమావేశం అయ్యారు. తెలంగాణ ఇప్పటికే సోలార్ విద్యుత్పాదనలో అగ్రస్థానంలో ఉందన్నారు. ఈ రంగానికి తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని మంత్రి వివరించారు. రాష్ర్టంలో పవర్, మెడికల్ డివైజేస్ మాన్యూఫాక్చరింగ్ రంగాల్లో ఉన్న పెట్టుబడుల అవకాశాలను వివరించారు. ఇన్వెస్ట్ మెంట్ కార్పోరేషన్ అప్ దుబాయ్ సీఈఓ మహ్మమద్ అల్ షయిభానీ తో మంత్రి సమావేశం అయ్యారు. తెలంగాణలో టెక్ సెంటర్ ఎర్పాటు చేయాలని కోరారు. దీంతోపాటు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పలు ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఈ సమావేశంలో చర్చించారు. హ్యూలెట్ ప్యాకర్ఢ్ (హెచ్పీ) సంస్థ ఉపాద్యక్షులు అనా పిన్కుజుక్ తో సమావేశం అయ్యరు. హెచ్పీ మరియు టీ హబ్ ల భాగాస్వామ్యానికి ఉన్న అవకాశాలను పరిశీలించాల్ని మంత్రి పిన్యూజుక్ ను కోరారు. దీంతోపాటు నగరంలో హెచ్ పి కార్యాకలాపాలను విస్తరించాలని విజ్ఝప్తి చేశారు.
మొత్తంగా మంత్రి కేటీఆర్ మొదటిసారిగా దావోస్ వెళ్లినప్పటికీ బిజీ బిజీగా గడపడంతో పాటుగా...తనకు దక్కిన అవకాశంతో తెలగాణకు పెట్టుబడులు వచ్చేందుకు ప్రయత్నం చేశారని పలువురు పేర్కొంటున్నారు.