గురువారం ఒక పెద్ద న్యూస్‌ను అందరితో పంచుకుంటానంటూ మొన్న ట్వీట్ చేసిన ఐటీ మంత్రి కేటీఆర్ కు నెటిజన్ల నుంచి ప్రశ్నలతో పాటు … ఆ బిగ్ న్యూస్ ఏమై ఉంటుందోనని ఊహిస్తూ సరదా రిప్లైలు ఇచ్చారు. అందులో కొందరు బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో కేటీఆర్ బయట పెడతారంటూ ట్వీట్ చేశారు. ఇలా సాగిన సరదా సంభాషణలకు కేటీఆర్ తాజాగా రిప్లై ఇచ్చారు.
తను సృష్టించిన ఆ హైటెన్షన్ వెయిటింగ్ కు ఐటీ మంత్రి కేటీఆర్ తనదైన స్టయిల్లో ఫినిషింగ్ ఇచ్చారు. పింక్ రంగు వేసిన యాపిల్ కంపెనీ సింబల్ ను ట్వీట్ చేస్తూ ఇదే బిగ్ న్యూస్ అని అన్నారు. "అవును, నిజంగానే అది వెరీ వెరీ బిగ్ న్యూస్. ప్రపంచ మేటి ఐటీ కంపెనీ మన హైదరాబాద్ కు రావడం మహోన్నత విషయమే. గత ఏడాది మే నెలలోనే ప్రఖ్యాత సోషల్ సైట్ గూగుల్ కంపెనీ కూడా హైదరాబాద్‌కు వచ్చింది. ఈ ఏడాది అదే నెలలో యాపిల్ సంస్థ రావడం గర్వకారణం" అని కేటీఆర్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.
ట్విట్టర్ లో బిగ్ న్యూస్ పోస్ట్ చేసే ముందు కేటీఆర్ ఓ చిన్న ట్విస్ట్ ఇచ్చారు. ఫాలోవర్లను టెన్షన్ పెట్టేందుకు బాహుబలి న్యూస్ ను కూడా టచ్ చేశాడు. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపారో తెలుసుకోవాలనుకుంటున్నారా ! ఆ విషయం నాకు తెలియదు. అది నా మిత్రుడు హీరో రానా చెబుతాడని మంత్రి కేటీఆర్ ట్విట్ చేశారు.