తెలంగాణ ముఖ్యమంత్రి, గులాబీ దళపతి కేసీఆర్ రాజకీయ వారసత్వంపై నెలకొన్న చర్చోపచర్చలకు ఫుల్ స్టాఫ్ పెట్టేందుకు మరో ప్రత్యక్ష ఉదాహరణ దొరికింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గులాబీ దుమ్ము రేపే విజయం అనంతరం "అన్న కేటీఆరే నాన్న రాజకీయ వారసుడు" అని కేసీఆర్ కూతురు - ఎంపీ కవిత ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇపుడెందుకు ఆ చర్చ అని చెప్పిన కేటీఆర్ తాజాగా ఇపుడు అదే డిస్కషన్ లో క్లారిటీ ఇచ్చారు.
కాలికి అయిన గాయం కారణంగా సీఎం క్యాంప్ ఆఫీసు నుంచి కదలకుండా ఉంటున్న మంత్రి కేటీఆర్ గాయం మానిన తర్వాత బంజారాహిల్స్ లోని తమ సొంత నివాసంలో జీహెచ్ ఎంసీ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. అయితే ఆ మరుసటి రోజే సీఎం క్యాంపు కార్యాలయంలోనే సమీక్ష చేపట్టారు. సీఎం కేసీఆర్ కూర్చునే సీటును కాస్త పక్కకు నెట్టి ఆ పక్కనే మరో కుర్చీ వేసుకొని రివ్యూ చేశారు. ఈ సమీక్షకు హాజరైన వారంతా సీఎం కేసీఆర్ రాజకీయ వారసుడే కాదు అధికార వారసుడు కూడా కేటీఆర్ అని చర్చించుకున్నారు.