తెలంగాణలో టీడీపీ అంతంతమాత్రంగా బతుకుతోంది. హైదరాబాద్ లో సెటిలర్లు ఎక్కువగా ఉన్న కూకట్ పల్లి ప్రాంతం ఒక్కటి ఆ పార్టీని బతికిస్తోంది. కానీ... ఇప్పుడు దాన్ని కూడా టీఆరెస్ తమ ఖాతాలో వేసుకోవాలని ప్లాన్ చేస్తోంది. వచ్చే ఎన్నికల కోసం పథక రచన చేస్తోంది. సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్ ఇక్కడి నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది.
గత ఎన్నికల్లో కరీంనగర్ జిల్లా సిరిసిల్ల నుంచి కేటీఆర్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక్కడి నుంచి ఆయన వరుస విజయాలు నమోదు చేసుకున్నారు. అయితే ఈ మధ్య నియోజకవర్గానికి ఆయన దూరంగా ఉంటున్నారు. మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించడంలో బీజీగా ఉండడంతో ఆయనకు, నియోజకవర్గ ప్రజలకు మధ్య గ్యాప్ వచ్చిందని తెలుస్తోంది. నియోజకవర్గ సమస్యలను పరిష్కారించడంలో ఆయనకు రెండోస్థాయి నేత లేకపోవడం ఒక లోటు. దీంతో ఆయన నియోజకవర్గం మారాలని ఆలోచిస్తున్నారని గులాబీ వర్గాలు అంటున్నాయి. పనిలో పనిగా టీడీపీ చేతిలో ఉన్న కూకట్ పల్లిని లాక్కోవాలంటే తాను పోటీ చేయడమే బెటర్ అన్న ఉద్దేశంతో ఆయన ఆ నియోజకవర్గంపై కన్నేశారని టాక్.
పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఆయనకు హైదరాబాద్ తో అనుబంధం పెరిగింది. గ్రేటర్ ఎలక్షన్ లో ఆయన గల్లీగల్లీ తిరిగారు. హైదరాబాద్ డెవలఫ్ మెంట్ పై ఆయన ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఆయన వచ్చే ఎన్నికల్లో కూకట్ పల్లి లేదా శేరిలింగం పల్లి నుంచి బరిలో ఉంటారని కొందరి అంచనా. ఈ రెండు ప్రాంతాల్లో సాఫ్ట్ వేర్ జనం ఎక్కువగా ఉండడం.. ఆయన ఐటీ మంత్రి కావడం కూడా కలిసొస్తుందని భావిస్తున్నారు. శనివారం కేటీఆర్ కూకట్ పల్లిలో ఇండోర్ స్టేడియాన్ని ప్రారంభించారు. దీంతో ఈ ప్రచారం మరింత పెరిగింది. ట్విట్టర్ లో ఎప్పుడూ జనానికి టచ్‌లో ఉండే కేటీఆర్…అర్బన్ మిడిల్ క్లాస్ తో పాటు హైక్లాస్ లో కూడా ఆయనకు మంచి పేరుంది. దీంతో ఆయన సిటీలో ఎక్కడ పోటీ చేసినా గెలుస్తారంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/