టీఆర్‌ఎస్ 20 ఏళ్ల ప్రస్థానం ... మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు !

Update: 2020-04-27 13:00 GMT
తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన పార్టీ టీఆర్ ఎస్ పార్టీ. సరిగ్గా రెండు దశాబ్దాల కిందట 2001 ఏప్రిల్‌ 27న తెలంగాణ జాతిని విముక్తం చేయడానికి కేసీఆర్ ఉద్యమ పార్టీని స్థాపించి తొలి అడుగు వేశారు. అటువంటి టీఆర్ ఎస్ పార్టీ సోమవారం 20వ వార్షికోత్సవాన్ని జరుపుకొంటుంది. అయితే.. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ వేడుకలను నిరాడంబరంగా నిర్వహించుకోవాలని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ తో పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ , మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.

కేసీఆర్‌ చచ్చుడో, తెలంగాణ వచ్చుడో’ తేలిపోవాలని 2009 నవంబర్‌ 29న కేసీఆర్‌ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఉద్యమ చరిత్రలో ఇది కీలక మలుపు. కేంద్ర ప్రభుత్వం వెంటనే దిగొచ్చింది. 2009 డిసెంబర్‌ 9న నాటి హోం మంత్రి చిదంబరం.. తెలంగాణ ప్రక్రియను ప్రారంభిస్తున్నామని ప్రకటించారు. కానీ, కేసీఆర్‌ దీక్ష విరమించిన తర్వాత కొద్ది గంటల్లోనే యూపీఏ యూ టర్న్‌ తీసుకుంది. దీంతో తెలంగాణలో ఉద్యమం మరింత ఉధృతమైంది. త్యాగాల కొలిమిగా తెలంగాణ మారింది. తెలంగాణ ఏర్పాటు బిల్లు లోక్‌ సభలో ఫిబ్రవరి 18న, రాజ్యసభలో ఫిబ్రవరి 20న ఆమోదం పొందింది. రాష్ట్రపతి మార్చి 1న తెలంగాణ బిల్లుకు ఆమోదం తెలిపారు. గెజిట్‌లో 2014 జూన్‌ 2 ‘అపాయింటెడ్‌ డే’ గా పేర్కొన్నారు. దీంతో జూన్‌ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగింది.

టీఆర్‌ఎస్ ఆవిర్భవించి 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రి కేటీఆర్.. ఉద్యమ కాలం నాటి అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ట్విటర్ ద్వారా కొన్ని ఫోటోలు షేర్ చేశారు. ఆసక్తికర కామెంట్లు పెట్టారు. ఉద్యమ ప్రస్థానంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న దృశ్యాలు, అరెస్టై ఠాణాలో ఉన్న ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. అలాగే , ‘తెలంగాణకు గుండె బలాన్నిచ్చిన జెండా.. గుండె గుండెను ఒకటి చేసిన జెండా.. ఉద్యమానికి ఊపిరి పోసిన జెండా, పేదవాడి ఆకలి తీర్చిన జెండా, రైతన్నకు భరోసా ఇచ్చిన జెండా.. తెలంగాణా ప్రజలకు అండా దండా మన గులాబీ జెండా..’ అంటూ టీఆర్‌ ఎస్ పార్టీ చేసిన ట్వీట్‌ను కేటీఆర్ రీట్వీట్ చేశారు.
Tags:    

Similar News