బీహార్ అసెంబ్లీలో బీజేపీ గెలిచేసింది. మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఉప ఎన్నికల్లోనూ విజయం సాధించింది. తాజాగా తెలంగాణలోని దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ కమలం వికసించింది. ఉత్తరాదిన.. ఇటు దక్షిణాదిన బీజేపీ వేవ్ కనిపిస్తోంది. ఈ క్రమంలోనే కేంద్రంలోని బీజేపీ అధిష్టానం జమిలి ఎన్నికలకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ అలెర్ట్ అయ్యింది. జమిలి ఎన్నికలపై కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు.
మంత్రి కేటీఆర్ తాజాగా జమిలి ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్ ఫలితాలపై ఆదివారం టీఆర్ఎస్ భవన్లో విస్కృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు.. కార్పొరేటర్లు పాల్గొని గ్రేటర్ ఫలితాలపై అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కేంద్రం జమిలి ఎన్నికల దిశగా వెళుతుందని చెప్పారు. ఏ క్షణమైన జమిలి ఎన్నికలు రావచ్చని.. శ్రేణులు అప్రమత్తంగా ఉండాలంటూ పిలుపునిచ్చారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సిట్టింగ్ కార్పొరేటర్లను మార్చిన దగ్గర గెలిచామన్న కేటీఆర్.. మార్చని చోట సిట్టింగ్ కార్పొరేటర్లు చాలా మంది ఓడిపోయారన్నారు. ఇక్కడే లెక్క తప్పిందని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితి రిపీట్ అయ్యే ప్రమాదం ఉందని, గ్రేటర్ ఫలితాలను గుణపాఠంగా తీసుకుందామన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు లోపాలు సరిదిద్దుకోవాలన్నారు.
కేంద్రానికి వ్యతిరేకంగా రైతులు పిలుపునిచ్చిన భారత్ బంద్ కు టీఆర్ఎస్ మద్దతు ప్రకటించిందని కేటీఆర్ తెలిపారు. టీఆర్ఎస్ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొని ఢిల్లీ పెద్దల దిమ్మతిరిగేలా బంద్ ను పాటించాలని కోరారు. ఎన్నికల్లో గెలుపొటములు సహజమని.. ఎప్పటిలాగే తెలంగాణలో అభివృద్ధి చేస్తూ ముందుకెళుతామని తెలిపారు. రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై శ్రేణులు దృష్టిసారించాలని సూచించారు.