‘మా మౌనాన్ని బలహీనతగా భావించొద్దు.. గోడకు వేలాడుతున్న తుపాకీ కూడా మౌనంగానే ఉంటుంది.. దాన్ని వాడటం మొదలుపెడితే దిమ్మదిరిగే సమాధానం వస్తుంది.. ’ అని మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఈ స్థాయిలో కేటీఆర్ ఎప్పుడూ బీజేపీని విమర్శించిన దాఖలాలు లేవు. అలాంటిది తాజాగా బీజేపీ నాయకులపై విరుచుకుపడ్డారు.
బీజేపీ నాయకులు వాట్సాప్ యూనివర్సిటీలో అబద్ధాలు నేర్చుకుంటున్నారని.. అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ హెచ్చరించారు.
దుబ్బాక, జీహెచ్ఎంసీలో కొన్ని స్థానాలు గెలిచిన బీజేపీ ఆగడం లేదని.. గతంలో పైశాచిక ఆనందంతో మాట్లాడినోడు ఓటుకు నోటు కేసులో ఎగిరిపోయిండని.. మీ లెక్కలు కూడా మా దగ్గర ఉన్నాయని.. కేసీఆర్ మౌనాన్ని తక్కువగా అంచనావేయొద్దని కేసీఆర్ హెచ్చరించారు.
తిడుతున్న బీజేపీ నేతలకు మిత్తితో సహా బదులిస్తాం అని కేటీఆర్ హెచ్చరించారు. అవసరమైనప్పుడు బఫూన్ల భరతం పడుతామని హెచ్చరించారు.
దీనికి తాజాగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కూడా కౌంటర్ ఇచ్చారు. ‘గోడకు వేసిన తుపాకీ తుప్పు పట్టి పోయిందని.. కేసీఆర్ ఫాంహౌస్ పడుకుంటారని’ ఎద్దేవా చేశారు.బీజేపీని వాట్సాప్ యూనివర్సిటీ అనే నైతిక అర్హత టీఆర్ఎస్ కు లేదన్నారు. కేసీఆర్ ను ఉరికించి కొడుతానన్న వాల్లకే మంత్రి పదవి ఇచ్చారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.