రాష్ట్ర ఐటీ - పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్వయంగా తాను రూపొందించిన నిబంధనలు తన కోసం ఉల్లంఘించడంపై కన్నెర్ర చేశారు! తన సమక్షంలోనే...తనకోసమే రూల్స్ ను లైట్ తీసుకోవడం చూసి తట్టుకోలేకపోయారు!. పార్టీ నేతలని కూడా చూడకుండా...ఏకంగా ఫైన్ వేయించారు. ఇదంతా హైదరాబాద్ లో జరిగింది. ఎందుకోసం అంటే... ఫ్లెక్సీలు కట్టినందుకు. అది కూడా కేటీఆర్ కోసం కావడం గమనార్హం.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఫ్లెక్సీలు కట్టవద్దని గతంలోనే నిబంధనలు రూపొందించిన సంగతి తెలిసిందే. అయితే వీటిని ఎక్కడా పట్టించుకున్న దాఖలాలు లేవు. తాజాగా కూడా అదే జరిగింది. మలక్ పేట్ ఇండోర్ స్టేడియం ప్రారంభం కోసం మంత్రి కేటీఆర్ వెళ్లారు. అయితే ఆయన రాకను పురస్కరించుకొని ప్లెక్సీలు కట్టారు. దీనిపై మంత్రి ఫైర్ అయ్యారు. జీహెచ్ ఎంసీ నిబంధనలకు విరుద్దంగా ఫ్లెక్సీలు కట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. అంతేకాకుండా...ఫ్లెక్సీలు కట్టిన వారికి జరిమానా విధించాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలు కట్టిన కార్పొరేటర్ సునరితా రెడ్డికి రూ. 50 వేలు - మాజీ కార్పొరేటర్ అస్లాంకు రూ. 25 వేల జరిమానా విధించాలని మున్సిపల్ అధికారులను మంత్రి ఆదేశించారు.
ఇదిలాఉండగా...ఎల్బీనగర్ సాహెబ్ నగర్ లో మంచినీటి రిజర్వాయర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రికార్డు సమయంలో హైదరాబాద్ ప్రజల నీటి కష్టాలను తీరుస్తున్నామని తెలిపారు. దశాబ్దాలుగా హైదరాబాద్ ప్రజలు పడుతున్న మంచినీటి కష్టాలకు చరమగీతం పాడుతున్నామని స్పష్టం చేశారు.నగర ప్రజలకు మంచినీటిని అందించేందుకు ఏడు రిజర్వాయర్లను నిర్మించుకున్నామని చెప్పారు. `గతంలో ఎండా కాలం వచ్చిందంటే ఖైరతాబాద్ లోని జలమండలి ఆఫీసు ముందు ఖాళీ బిందెల ప్రదర్శన జరిగేది. ప్రభుత్వాలు భయపడే పరిస్థితి. మంచినీటి - కరెంట్ సమస్యతో ప్రజలు రోడ్డెక్కేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. 24 గంటల కరెంట్ ఇస్తున్నాం.. ఇంటింటికి మంచినీరు సరఫరా చేస్తున్నాం` అని మంత్రి ఉద్ఘాటించారు. మహానగరంలో నీటి ఎద్దడి తీర్చేందుకు రూ. 2 వేల కోట్లతో తాగునీరు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
సాహెబ్ నగర్ లో రిజర్వాయర్ల నిర్మాణం పూర్తవడానికి సమయం 2018 మార్చి అయినప్పటికీ.. మూడు నెలల ముందే పూర్తి చేసి తాగునీరు అందిస్తున్నామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రజలకు మేలు చేసే విషయంలో - అభివృద్ధి విషయంలో పార్టీలకతీతంగా నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ పెద్దమొత్తంలో అభివృద్ధి ఫలాలు అందిస్తున్నారని చెప్పారు. మూసీని కూడా సుందరీకరిస్తామని కేటీఆర్ ఉద్ఘాటించారు. `ఎల్బీనగర్ సామాన్యమైన నేల కాదు. తొలి అమరుడు శ్రీకాంతాచారి ఇక్కడే ఆత్మహత్య చేసుకున్నారు. ఎల్బీనగర్ త్యాగాల గడ్డ. ఈ ప్రాంతం నుంచే అద్భుతమైన ఉద్యమాలు జరిగాయి. ఈ గడ్డను సీఎం కేసీఆర్ ఎప్పటికీ మరిచిపోరు` అని కేటీఆర్ తెలిపారు.
`తెలంగాణ వస్తే కరెంటే ఉండదు. పరిశ్రమలు పారిపోతాయి. పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ రారు అని కిరణ్‌కుమార్‌రెడ్డి భయపెట్టారు. కానీ ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందింది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో సమస్యలన్నింటినీ పరిష్కరిస్తున్నాం. ఈ ఏడాది జనవరి 1 నుంచి.. రైతన్నలకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని గుర్తు చేశారు. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే` అని కేటీఆర్ తెలిపారు.