తీవ్ర ఆసక్తిని.. చర్చను రేపిన అంశానికి సంబంధించి అంశానికి సంబంధించిన స్పష్టత వచ్చేసింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కోడలు.. మంత్రి కేటీఆర్ సతీమణి శైలిమకు అసలు ఓటే లేదన్న మాట రాజకీయ వర్గాల్లోనూ.. సామాన్య ప్రజల్లోనూ ఆసక్తికర వాదనకు తెర తీసింది. శనివారం నిర్వహించిన బహిరంగ సభలో ఏపీ ముఖ్యమంత్రి సతీమణి భువనేశ్వరి ఓటు తమకే వేస్తారని.. ఆమె తమ కార్యకర్తలకు చెప్పారంటూ కేసీఆర్ వ్యాఖ్యల నేపథ్యంలో.. ఆయన కోడలకు అసలు ఓటే లేదన్న మాట పెద్ద చర్చగా మారింది.
గ్రేటర్ ఎన్నికల్లో తెలంగాణ అధికారపక్షం తరఫున అన్నితానై నిలిచిన కేటీఆర్ సతీమణికి ఓటు లేకపోవటం ఏమిటన్నది పెద్ద ప్రశ్నగా మారింది. అయితే.. ఆమెకు ఓటు ఉందని.. కాకుంటే.. కేటీఆర్ కు ఓటున్న నందినగర్ లో కాకుండా.. హిమాయత్ నగర్ లో అన్న విషయం తాజాగా వెల్లడైంది. మంత్రి కేటీఆర్ తన ఓటుహక్కును బంజారాహిల్స్ నూర్ నగర్ లో ఉన్న పోలింగ్ బూత్ లో వినియోగించుకుంటే.. ఆయన సతీమణి శైలిమ హిమాయత్ నగర్ లో తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. దీంతో.. కేటీఆర్ సతీమణికి ఓటు లేదని సాగుతున్న ప్రచారం నిజం కాదని తేలిపోయింది.