తెలంగాణ అధికారపక్షంలో నెంబర్ టూగా అవతరించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ తన ‘పెద్దరికాన్ని’’ హుందాగా ప్రదర్శిస్తున్నాడు. ఆ మధ్య కాలం వరకూ కేటీఆర్.. హరీశ్ మధ్యన నువ్వా.. నేనా అన్న తెరచాటు అధిపత్య పోరు ముగిసి.. కేటీఆర్ స్పష్టమైన అధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న వేళ.. అందుకు తగ్గట్లే వ్యవహరించటం విశేషం.
అన్నీ తానై వ్యవహరించిన నారాయణ ఖేడ్ ఉప ఎన్నికలో టీఆర్ ఎస్ కు అద్భుత విజయాన్ని అందించిన హరీశ్ రావుకు.. పార్టీ నాయకత్వానికి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా ట్వీట్ తో అభినందించటం గమనార్హం. పే..ద్ద వాహనానికి ఉండే చక్రాలతో విపక్షాల్ని తొక్కేస్తామన్న అర్థం వచ్చేలా కేటీఆర్ ట్వీట్ సాగింది. టీఆర్ ఎస్ అనే మహాశక్తితో తమ జైత్రయాత్రను అప్రతిహతంగా సాగిస్తామని.. 50వేల అద్భుత మెజార్టీని ఖేడ్ ఉప ఎన్నికలో పొందటంపై ఆయన హర్షాన్ని వ్యక్తం చేశారు. మొత్తానికి ఖేడ్ విజయానందంలో కేటీఆర్.. పెద్ద పెద్ద చక్రాలతో విపక్షాల్ని తొక్కేస్తామన్న మాటను నర్మగర్భంగా చెప్పారు.
హరీశ్ తో పాటుగా ఖేడ్ నాయకత్వానికి ఆయన శుభాకాంక్షలు చెప్పిన తీరు చూస్తే.. కేటీఆర్ తన నెంబర్ 2 స్థాయిని ప్రదర్శిస్తున్నట్లుగా పెద్దరికంతో.. ఫలితం వెలువడిన వెంటనే అభినందనలు తెలపటం గమనార్హం.