యువత కు గుడ్ న్యూస్ చెప్పిన కేటీఆర్

Update: 2020-01-07 10:32 GMT
తెలంగాణకు పెద్ద దిక్కు హైదరాబాద్. రాష్ట్రంలో అసలు రెండో పెద్ద పట్టణమే లేదు. హైదరాబాద్ లా విమానాశ్రయం.. అంతర్జాతీయ స్టేడియాలు తెలంగాణలోని వేరే ఇతర నగరాల్లో లేవు. అయితే హైదరాబాద్ తర్వాత కాస్తోకూస్తో తెలంగాణలో పెద్ద నగరం వరంగల్. ఆ వరంగల్ లో మూడు ఐటీ కంపెనీలను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ యువతకు ఓ భారీ ఆఫర్ ను ప్రకటించారు.

వరంగల్ లోని మడికొండ మంగళవారం సైయెంట్, టెక్ మహీంద్రా ప్రాంగణాలను కేటీఆర్ ప్రారంభించారు. ఐటీ గ్లోబల్ డెలివరీ సెంటర్ ను మొదలు పెట్టారు. ఈ సైయెంట్ , టెక్ మహీంద్రాల వల్ల మొత్తం 800మందికి కొత్త ఐటీ జాబ్స్ వచ్చాయని కేటీఆర్ తెలిపారు.

కేటీఆర్ మాట్లాడుతూ.. ‘వరంగల్ పట్టణం లో ఇతర జిల్లాల్లో ఐటీ విస్తరణ అనేది కేవలం ఆరంభం మాత్రమేనని.. సైయెంట్ కన్నా టెక్ మహీంద్ర దాదాపు 9 రెట్లు పెద్దదని.. వరంగల్ యువత కు ఇక్కడే ఉద్యోగావకాశాలు దక్కనున్నాయని.. రాష్ట్రంలోని అన్ని ద్వితీయ శ్రేణి నగరాలైన వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ, ఖమ్మంలలో ఈ ఏడాది లోనే ఐటీ రంగాన్ని విస్తరిస్తామని.. యువత కు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తాం’ అని హామీ ఇచ్చారు..

హైదరాబాద్-వరంగల్ కారిడార్ ను పారిశ్రామిక కారిడార్ రూపొందిస్తామని కేటీఆర్ ప్రకటించారు. మామునూరు ఎయిర్ పోర్టును ప్రారంభిస్తామని తెలిపారు. 2016లో కేటీఆర్ వరంగల్ లో ఐటీసెజ్ ను ప్రారంభించారు. నాలుగేళ్లలో అక్కడ 3 కంపెనీలు పని ప్రారంభించడంపై యువత హర్షం వ్యక్తం చేసింది.


Tags:    

Similar News