కాంగ్రెస్ - జేడీఎస్ నేతృత్వంలో 14 నెలల పాటు కొనసాగిన సంకీర్ణ ప్రభుత్వం పతనం తర్వాత రెండు పార్టీల నేతలు ఒకరిపై మరొకరు మాటల యుద్ధానికి దిగుతున్నారు. సంకీర్ణ ప్రభుత్వం కూలడానికి కాంగ్రెస్ నాయకులే కారణమని జేడీఎస్ పెద్దలు బహిరంగ విమర్శలకు దిగారు. ఇదే క్రమంలో కాంగ్రెస్ నేతలు కూడా మాటల యుద్ధానికి దిగుతున్నారు. వీరికి ట్విట్టర్ వేదికగా మారింది. సంకీర్ణ ప్రభుత్వం పతనానికి ‘మీరంటే.. మీరే’ కారకులని ఒకరిపై మరొకరు ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధానికి దిగుతున్నారు.
‘సిద్ధరామయ్యే నా తొలి శత్రువు.. బీజేపీ కాదు’ అని మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎల్పీ నాయకుడు సిద్ధరామయ్యను లక్ష్యంగా చేసుకుని గత మూడు రోజులుగా మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ సంచలన ఆరోపణలు చేస్తుండగా ఆయన కుమారుడు హెచ్ డీ కుమారస్వామి విరుచుకుపడ్డారు. సంకీర్ణ ప్రభుత్వం పతనం కావడానికి సిద్ధరామయ్యే కారణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ముఖ్యమంత్రి కావడాన్ని సిద్ధరామయ్య ఏమాత్రం సహించలేక ప్రభుత్వ పతనానికి పూనుకున్నారని ఆరోపించారు. తన సన్నిహిత ఎమ్మెల్యేల ద్వారా ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతూ చివరికి వారిచేత రాజీనామాలు చేయించి సంకీర్ణం కూలిపోవడానికి కారకులయ్యారని మండిపడ్డారు.
సంకీర్ణ ప్రభుత్వ పతనానికి దేవెగౌడ తనయులు కుమారస్వామి - రేవణ్ణ కారణమని సిద్ధరామయ్య ఆరోపించారు. కుటుంబ రాజకీయాలు చేయడంతోనే ప్రభుత్వం పతనమైందని వ్యాఖ్యానించారు. ఈనేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ అంశంలో సీబీఐ విచారణ చేయాలని సిద్ధరామయ్య పట్టుబట్టారు. సిద్ధరామయ్య ఒత్తిడి మేరకే ఫోన్ ట్యాపింగ్ కేసులో సీబీఐ విచారణకు ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. సంకీర్ణ ప్రభుత్వంలో అసంతృప్త ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చేందుకు తాను సిద్ధమైనట్లు తెలిపారు. అయితే జేడీఎస్ నేతలు ఒప్పుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సంకీర్ణ ప్రభుత్వంలో తాను ముఖ్యమంత్రిగా కాకుండా ఒక క్లర్క్ తరహాలో పని చేశానని కుమారస్వామి చెప్పుకొచ్చారు. సిద్ధరామయ్య మరోసారి సీఎం కావాలనే ఆశతోనే ఉద్ధేశపూర్వకంగా తనపై కుట్రలు చేశారని మండిపడ్డారు. ఒకవేళ యడియూరప్ప ప్రభుత్వం నడపడంలో విఫలమైతే మరోసారి తాను సీఎం కావచ్చనే ఆశతో సంకీర్ణ ప్రభుత్వ పతనానికి కారకులయ్యారని తెలిపారు. సంకీర్ణ ప్రభుత్వంలో కాంగ్రెస్ నేతలు తనపై పెత్తనం చేసేవారని - జిల్లా అధికారుల బదిలీలతో కలిసి అన్ని విషయాలు కాంగ్రెస్ నేతలు చెప్పినట్లే చేశానన్నారు.
మాజీ సీఎం కుమారస్వామి తన మాటలను సాయంత్రానికి యూటర్న్ తీసుకున్నారు. తానెప్పుడూ సిద్ధరామయ్య తన తొలి శత్రువు అని చెప్పలేదని ట్వీట్ చేశారు. డిజిటల్ మీడియా విలేకరులకు కొన్ని రోజుల క్రితం ఇచ్చిన సందేశాన్ని తాజాగా కొందరు మార్చి చెబుతున్నారని తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. ఎన్నికలకు ముందు బీజేపీ కంటే తమ పార్టీనే సిద్ధరామయ్య ఎక్కువగా విమర్శించారని చెప్పారు. అంతేకానీ తానెప్పుడూ సిద్ధరామయ్య నా మొదటి శత్రువు అని చెప్పలేదని పేర్కొన్నారు.