కొద్దికాలంగా సంచలన - వివాదాస్పద వార్తలకు దూరంగా ఉంటున్న కర్ణాటక ప్రభుత్వం తాజాగా మరోమారు ఆసక్తికరమైన అప్ డేట్ తో తెరమీదకు వచ్చింది. ఈ దఫా అక్కడి ప్రతిపక్షాలలో అధికార పక్షాలలో కాదు..సాక్షాత్తు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ఈ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా మీడియా విషయంలో ఆయన మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ విధానసౌధ తలుపులు తెరుస్తానని చెప్పిన ఆయన.. యూటర్న్ తీసుకున్నారు. అసెంబ్లీలోకి మీడియా రాకూడదని ఆదేశాలు జారీ చేశారు. దీనిపై కన్నడలోని ప్రతిపక్ష పార్టీలు భగ్గుమంటున్నాయి.
తన ఎన్నికల హామీల్లో తాను అధికారంలోకి వస్తే ఎవరికీ ఎలాంటి అడ్డంకి లేకుండా అందరినీ విధాన సౌధలోకి వచ్చేలా చేస్తానని కుమారస్వామి హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీకి భిన్నంగా తాజాగా ఆయన ఆంక్షలు విధించారు. మంగళవారం ఉదయాన్నే విధానసౌధకు వెళ్లిని మీడియా వాళ్లకు అక్కడి భద్రతా సిబ్బంది షాకిచ్చారు. మిమ్మల్ని లోపలికి రానివ్వకూడదని తమకు మౌఖిక ఆదేశాలు ఉన్నాయని వాళ్లు మీడియాతో చెప్పారు. దీంతో అవాక్కవడం పార్టీ నేతల వంతు అయింది. మీడియా కోసం అసెంబ్లీ ఆవరణలోనే ఓ ప్రత్యేకమైన ప్రదేశాన్ని ఏర్పాటు చేస్తామని - అక్కడే మొత్తం సమాచారం వాళ్లకు అందుతుందని కుమారస్వామి చెప్పారు. ``విధానసౌధలో ఎక్కడపడితే అక్కడ మీడియా వాళ్లు కనిపిస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో సమయానికి వస్తున్నారు. దీనివల్ల అందరికీ ఇబ్బంది కలుగుతోంది. అందుకే వాళ్ల కోసం ప్రత్యేకంగా ఓ ప్రదేశాన్ని ఇవ్వాలని నిర్ణయించాం ``అని ఆయన తెలిపారు.
ఇదిలాఉండగా...ఈ పరిణామంపై మీడియా ప్రతినిధులు అవాక్కయ్యారు. విధానసౌధ డీసీపీ అనంత్ కుమార్ ను సంప్రదించగా... ``మీడియాపై ఎలాంటి నిషేధం లేదు. అయితే వాళ్లకు ఆవరణలో ఎక్కడ చోటు కల్పించాలన్నదానిపై చర్చిస్తున్నాం`` అని చెప్పారు. కాగా, ఎన్నికల హామీలను భిన్నంగా ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడంపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. ఆ పార్టీ ఎమ్మెల్సీ రవికుమార్ మాట్లాడుతూ.. సీఎంకు మీడియా అంటే ఎందుకంత భయం? మీరు చేసే పనులు ఎవరూ చూడకూడదని ఇలా చేస్తున్నారా? మీడియాను నియంత్రించడం సరైనదేనా అని ప్రశ్నించారు. అయితే ఇలాంటి నిబంధనలను మీడియాను అవమానించడమే అవుతుందని కర్ణాటకలోని అన్ని ప్రముఖ మీడియా సంస్థలు అభిప్రాయపడుతున్నాయి.