రాజకీయాలు మహా దుర్మార్గంగా ఉంటాయి. తమ ఎదుగుదల కోసం తమకు పోటీదారుపై విషాన్ని కక్కటం మామూలే. వెనుకా ముందు చూసుకోకుండా... తమ ప్రయోజనాలు తప్పించి మరింకేమీ పట్టని వైనం ఇప్పుడా ముఖ్యమంత్రిని వేలెత్తి చూపేలా చేస్తోంది. ఎంత కొడుకైతే మాత్రం.. ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఆడబిడ్డ అన్న విషయాన్ని చూడకుండా ఇష్టం వచ్చినట్లుగా చేస్తున్న వ్యాఖ్యలు వారి ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు.
భర్త చనిపోయిన మహిళ ముఖం ఎలా ఉండాలి? ఎలా వ్యవహరించాలి? అన్న పాఠాలు చెబుతున్న కర్ణాటక సీఎం తీరును పలువురు తప్పు పడుతున్నారు. కొడుకు కోసం మరీ ఇంతలా దిగజారిపోవాలా? అన్న ప్రశ్న అంతకంతకూ ఎక్కువ అవుతోంది.
తాజాగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కర్ణాటకలోని మాండ్య నియోజకవర్గం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రముఖ సినీ నటుడు అంబరీష్ మరణం నేపథ్యంలో ఆయన సతీమణి కమ్ సినీనటి సుమలత తాజాగా ఎంపీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆమెకు ప్రత్యర్థిగా కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ పోటీ చేస్తున్నారు. దీంతో.. ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం అంతకంతకూ ముదురుతోంది.
సుమలత రంగంలోకి దిగటంతో నిఖిల్ ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్నట్లుగా చెబుతున్నారు. దీంతో.. నిఖిల్ తండ్రి... కర్ణాటక సీఎం కుమారస్వామి బ్యాలెన్స్ తప్పి.. సుమలత మీద చేస్తున్న వ్యాఖ్యల్ని పలువురు తప్పు పడుతున్నారు. తాజాగా ఆ తరహాలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
అంబరీశ్ మరణించిన బాధ తాలూకు ఛాయలు సుమలత ముఖంలో కనిపించటం లేదని కుమారస్వామి విమర్శించటం తప్పుగా చెబుతున్నారు. సుమలత ప్రసంగాల్ని తాను గమనిస్తున్నానని.. ఆమె ముఖంలో భర్త చనిపోయిన బాధ ఏ మాత్రం లేదని మాట్లాడటం సంస్కారం కాదంటున్నారు.
భర్తను పోగొట్టుకున్న భార్య ఆవేదన ఎలా ఉండాలో కూడా కుమారస్వామి చెబుతారా? అన్న ప్రశ్నలు పలువురి నోట వినిపిస్తోంది. భర్తను పోగొట్టుకున్న మహిళ అంటూ అదే పనిగా విమర్శలు చేస్తున్న దేవెగౌడ కుటుంబ సభ్యుల వ్యాఖ్యలు సుమలతపై సానుభూతిని మరింత పెంచుతున్నట్లుగా చెబుతున్నారు. కొడుకు మీద.. అతగాడి కెరీర్ మీద ప్రతి తండ్రికి అదుర్దా ఉంటుంది. అంత మాత్రాన బ్యాలెన్స్ తప్పటం సరికాదు. ఈ విషయంలో కుమారస్వామి అదే పనిగా బుక్ అవుతున్నారని చెప్పాలి. ఒక మహిళను ఉద్దేశించి అదే పనిగా చేస్తున్న విమర్శలు ప్రజల్లో ఆయనపై ఉన్న గౌరవాన్ని తగ్గిస్తాయంటున్నారు. జర.. జాగ్రత్త కుమారస్వామి.