దిష్టిబొమ్మను ఎందుకు దేశాన్ని కాల్చేయండి.. ఏపీ సీఐ వివాదాస్పద వ్యాఖ్యలు
దారుణ ఉదంతాలు చోటు చేసుకున్నప్పుడు.. ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు దానికి వ్యతిరేకంగా నిరసనలు.. ఆందోళనలు చేపట్టటం చూస్తుంటాం. అలాంటి వేళ.. వాటిని అడ్డుకునే ప్రయత్నంలో సీఐ ఒకరు అనరాని మాటలు అనటాన్ని ఎలా తీసుకోవాలి? ఏమని చెప్పాలి? తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి చిత్తూరు జిల్లా కుప్పంలో చోటు చేసుకుంది. ఇటీవల అనంతపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు సంబంధించిన వ్యక్తిగత వీడియో బయటకు రావటం.. దీనిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేయటం.. అదంతా మార్ఫింగ్ మాయాజాలమని చెప్పటం తెలిసిందే.
ఈ వీడియోపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తటం.. విపక్షాలు విరుచుకుపడటంతో అధికార వైసీపీ నేతలకు ఇప్పుడీ ఇష్యూను ఎలా డైవర్టు చేయాలన్న దానిపై మల్లగుల్లాలు పడుతున్నట్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే వైసీపీ ఎంపీ తీరును తప్పు పడుతూ.. కుప్పం పట్టణంలో టీడీపీ శ్రేణులు ముఖ్యమంత్రికి.. ఎంపీకి వ్యతిరేకంగా నినాదాలు చేయటం షూరు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ దిష్టి బొమ్మను తగలబెట్టే ప్రయత్నం చేశారు.
అయితే.. ఈ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు కుప్పం అర్బన్ సీఐ శ్రీధర్ ప్రశ్నించారు. అనుమతి లేకుండా దిష్టి బొమ్మల్ని ఎలా తగలబెడతారు? అంటూ ప్రశ్నించారు. అంతేకాదు.. ఆందోళకారుల చేతుల్లో ఉన్న దిష్టిబొమ్మల్నితీసి పక్కకు పడేసిన ఆయన తీరుపై అక్కడి ఆందోళకారులు గరంగరంగా ఉన్నారు. అన్నింటికి మించి.. దిష్టి బొమ్మను తగలబెట్టే క్రమంలో సీఐ శ్రీధర్ జోక్యం చేసుకున్న తీరుపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దిష్టి బొమ్మ ఎందుకు దహనం చేస్తారు? అని ప్రశ్నిస్తూ.. 'దిష్టిబొమ్మను ఎందుకు.. దేశాన్ని కాల్చండి' అంటూ చేసిన వ్యాఖ్యల వీడియో ఇప్పుడు షేర్ అవుతోంది. సున్నిత అంశాలకు సంబంధించి కీలక అధికారులు రియాక్టు అయ్యే తీరు మారితే బాగుండన్న మాటలు వినపిస్తున్నాయి. అసలు కంటే కొసరు ఎక్కువన్న చందంగా.. ఎంపీ గోరంట్ల వీడియో కు ఏ మాత్రం తీసిపోని రీతిలో కుప్పం అర్బన్ సీఐ వ్యాఖ్యలు వీడియో సైతం వైరల్ గా మారింది.