మూడు రోజుల పర్యటన నిమిత్తం టీడీపీ అధినేత చంద్రబాబు..ఉమ్మడి కర్నూలుజిల్లాలో పర్యటిస్తున్నా రు. ఇప్పటికి రెండు రోజుల పర్యటన కూడా పూర్తయింది. ఈ రెండు రోజుల పర్యటనను గమనించిన సీనియర్ నాయకులు.. చంద్రబాబు పెద్ద మిస్టేక్ చేస్తున్నారే! అని కామెంట్లు చేస్తున్నారు. దీనికి కారణం.. చంద్రబాబు సహజంగానేజిల్లాల పర్యటన చేసినప్పుడు.. స్థానికంగా ఉన్న పార్టీ సమస్యలను పరిష్కరిస్తు న్నారు.
దీనివల్ల పార్టీలో నెలకొన్న సమస్యలు అంతో ఇంతో పరిష్కారం అవుతున్నాయి. కానీ, కర్నూలు విషయం లోకి వచ్చేసరికి మాత్రం.. ఇక్కడి స్థానిక సమస్యలపై ఆయన దృష్టి పెట్టలేదు.
కేవలం తనను తాను ప్రొజెక్టు చేసుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. తనకు లాస్ట్ ఛాన్స్ ఇవ్వాలంటూ.. ప్రజలను కోరారు. ఇది మైనస్ అయిందనే భావన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఇలాంటి అత్యంత సెన్సిటివ్.. సెంటిమెంట్ ఇష్యూలను ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు మాత్రమే ప్రజల్లోకి తీసుకువెళ్లాలి.
గతంలో 2019 ఎన్నికలకు ముందు కూడా.. వైసీపీ నాయకులు రెండు నెలల ముందే ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ.. ప్రజలను సెంటిమెంటు బాట పట్టించారు. దీంతో అధికార పార్టీ.. దీని నుంచి కోలుకునే సరికి ఎన్నికలు అయిపోయాయి. అదేవిధంగా.. ఇప్పుడు చంద్రబాబు కూడా.. లాస్ట్ ఛాన్స్ విషయంలో రెండు మాసాల ముందు ఈ అస్త్రాన్ని ప్రయోగించి ఉంటే బాగుండేదని.. టీడీపీ సీనియర్లు భావిస్తున్నారు. అసలు ఇప్పుడు రాష్ట్రంలో సమస్యలు, ప్రజలు ఎదుర్కొంటోన్న ఇబ్బందులు, ప్రభుత్వం అనుసరించే ప్రజా వ్యతిరేక కార్యక్రమాల గురించి మాట్లాడడం మానేసి బాబు ఈ రూట్లో వెళ్లడం సరికాదనే అంటున్నారు.
ఇక, కీలకమైన.. నియోజవకర్గాల విషయంలో చంద్రబాబు అసలు దృష్టి పెట్టలేదు. అంతా బాగుందని అనుకుంటున్నారో.. లేక.. తన ప్రేమ్ చూసి.. ఓట్లు వేస్తారని భావిస్తున్నారో.. తెలియదు.
కానీ, ఎక్కడ సభ పెట్టినా.. అంతా కూడా.. తన నామస్మరణలోనే చంద్రబాబు మునిగిపోయారు. దీనివల్ల కర్నూలు జిల్లాలోని నియోజకవర్గాల్లో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయనే వాదన వినిపిస్తోంది. మరి చంద్రబాబు వ్యూహం ఏంటో చూడాలని అంటున్నారు సీనియర్లు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.