పాక్ కు షాక్‌..నిషేధం విధించిన అర‌బ్ కంట్రీ

Update: 2017-02-02 16:40 GMT
తీవ్ర‌వాదం త‌మ ఎజెండా ముందుకు సాగుతూ అత‌ర్జాతీయ స్థాయిలో క‌ల‌వ‌రానికి కార‌ణంగా మారిన పాకిస్థాన్‌కు వ‌రుస ఎదురుదెబ్బ‌లు త‌గులుతున్నాయి. గ‌ల్ఫ్ దేశ‌మైన కువైట్ ఐదు దేశాలను నిషేధించింది. ఈ నిషేధ జాబితాలో పాక్ పేరు కూడా ఉంది. సిరియా - ఇరాక్‌ - పాకిస్థాన్‌ - ఆఫ్ఘ‌నిస్థాన్‌ - ఇరాన్ దేశస్థుల‌కు వీసాలు ఇవ్వ‌బోమ‌ని కువైట్ స్ప‌ష్టంచేసింది. ఈ ఐదు దేశాల వాసులు అస‌లు వీసాలు కోసం ద‌రఖాస్తు చేసుకోకూడ‌ద‌ని కువైట్ ప్ర‌భుత్వం తేల్చి చెప్పింది. ఈ దేశాల నుంచి ఇస్లామిక్ ఉగ్ర‌వాదులు త‌మ దేశంలోకి ప్ర‌వేశించే ప్ర‌మాదం ఉన్న కార‌ణంగా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపింది.

ఇస్లామిక్ ఉగ్ర‌వాదం  కార‌ణంతోనే అమెరికా కూడా ఏడు ముస్లిం దేశాల‌పై నిషేధం విధించిన సంగ‌తి తెలిసిందే. ఆ జాబితాలోనూ ఇరాన్‌ - ఇరాక్‌ - సిరియా ఉండ‌గా.. భ‌విష్య‌త్తులో పాకిస్థాన్‌ ను కూడా చేర్చుతామ‌ని వైట్‌ హౌజ్ ఇప్ప‌టికే స్ప‌ష్టంచేసింది. ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డ‌ర్స్ కంటే ముందే సిరియ‌న్ల‌కు త‌మ దేశంలో ప్ర‌వేశం లేద‌ని కువైట్ చెప్పింది. 2011లో సిరియ‌న్ల‌కు వీసాల జారీని కువైట్ నిలిపేసింది. క‌ఠిన సాంప్ర‌దాయ చ‌ట్టాలు అమ‌లులో ఉండే కువైట్‌లో బ‌హిష్కృతుల సంఖ్య చాలా ఎక్కువ‌. ప్ర‌పంచంలో ఎక్కువ మంది బ‌హిష్కృతులు ఉన్న దేశాల్లో కువైట్ ఒక‌టి. అయితే తాజా ప‌రిణామం పాకిస్తాన్ కు షాక్ వంటిద‌ని చెప్తున్నారు.

ఇదిలాఉండ‌గా...పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నది. మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. సాంబా సెక్టార్‌ లో భారత సైనిక స్థావరాలు లక్ష్యంగా పాక్ ఆర్మీ కాల్పులు జరిపింది. గ్రెనేడ్లు విసిరింది. పాక్ కాల్పులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News