వలసదారులని బహిష్కరించిన కువైట్ .. ఇండియన్స్ ఎంతమందంటే ?

Update: 2019-11-06 13:02 GMT
మన దేశంలో పని లేక చాలామంది ఇతర దేశాలకి పని కోసం వలస వెళ్తుంటారు. అలాగే ఇతర దేశాలలో ఇక్కడి కంటే  ఆదాయం కూడా భారీగానే వస్తుండటం తో చదువుకొని వారితో పాటుగా , చదువుకున్న వారు కూడా వలస వెళ్లి పోతున్నారు. వీరిలో ఎక్కువ శాతం మంది  వెళ్లే దేశాలలో .. అరబ్ దేశాలే ఉంటాయి. ముఖ్యంగా దుబాయ్ , కువైట్  మొదటి స్థానాలలో ఉంటాయి. అక్కడ అరబ్ షేక్స్ వద్ద పని చేస్తే .. మంచి ఆదాయం ఉంటుంది అని భావించి కువైట్ కి వెళ్తుంటారు.

కువైట్ కి వెళ్ళాలి అనుకుంటే ..అనుకున్నంత ఈజీ ఏమి కాదు. కానీ , ఎలాగోలా వీసా తెప్పించుకొని డబ్బు సంపాదనే లక్ష్యం గా దేశం కానీ  దేశం వెళ్తుంటారు. కువైట్ కి ఇండియన్స్ తో పాటుగా ఇతర దేశాల నుండి కూడా చాలామంది ఉద్యోగాల కోసం వస్తుంటారు. అలాంటివారిలో కొంతమంది అక్కడ నేరాలకు పాల్పడుతుంటారు. అలాంటివారిని కువైట్ ప్రభుత్వం వెనక్కి పంపేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ సంవత్సరం సెప్టెంబర్ 30 వరకు వివిధ కారణాలతో కువైట్ మొత్తం 18వేల మంది విదేశీయులను తమ దేశం నుంచి బహిష్కరించింది. కువైట్ బహిష్కిరించిన 18వేల మందిలో 5వేల మంది భారతీయులు కూడా  ఉన్నారు. అలాగే అందులో  6వేల మంది మహిళలు కూడా ఉండడం విశేషం.

కువైట్  దేశ హోం మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం... సంక్రమణ వ్యాధులు, వలస చట్టాల ఉల్లంఘన, ట్రాఫిక్ ఉల్లంఘనలు, క్రిమినల్ కేసులు, ఇతర కేసుల కారణంగా వివిధ దేశాలకు చెందిన వలసదారులను బహిష్కరించినట్లు తెలిపింది. కువైట్ బహిష్కరించిన మొత్తం 18వేల మందిలో అత్యధికంగా భారతీయులు 5,000 మంది  ఉన్నారు. ఆ తరువాతి స్థానాల్లో బంగ్లాదేశీయులు(2,500), ఈజిప్టియన్స్(2,200), నేపాలీయులు(2,100), ఈథియోపియన్లు(1,700), సిరియన్లు(1,400), ఫిలిప్పీనోస్(1,200) ఉన్నారు. మరో 50 మంది పురుషులు, 8 మంది మహిళలు బహిష్కరణ కేంద్రంలో ఉన్నట్లు హోం మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు.
Tags:    

Similar News