బాబు విష సంస్కృతిపై కేవీపీ అగ్గి ఫైర్‌

Update: 2017-06-05 13:15 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి వ్య‌వ‌హార‌శైలిపై కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌.. రాజ్య‌స‌భ స‌భ్యుడు కేవీపీ రామ‌చంద్ర‌రావు తీవ్రంగా మండిప‌డ్డారు. తాజాగా గుంటూరులో నిర్వ‌హించిన స‌భ‌ను అడ్డుకునేందుకు చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రించిన వైఖ‌రిని ఆయ‌న తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. బాబు విధానాల‌తో ఏపీ రాష్ట్ర భ‌విష్య‌త్తును నాశ‌నం అవుతోందంటూ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

బాబు తీరు ఏపీ భ‌విష్య‌త్ త‌రాల‌కు శాప‌మన్న కేవీపీ.. ప్ర‌త్యేక హోదా భ‌రోసా స‌భ‌ను ప‌వ‌ర్ తో అడ్డుకోవాల‌ని బాబు ప్ర‌య‌త్నించార‌న్నారు. దేశ రాజ‌కీయాల్లోకి చంద్ర‌బాబు విష సంస్కృతిని ప్ర‌వేశ పెడుతున్న‌ట్లుగా ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. విభ‌జ‌న చ‌ట్టంలో లోపాలు స‌వ‌రించుకోవాల‌ని.. అవ‌స‌ర‌మైతే పార్ల‌మెంటులో కొత్త చ‌ట్టాన్ని తెచ్చుకోవాల‌న్నారు.

ఏపీ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం విభ‌జ‌న చ‌ట్టాన్ని రాజ‌కీయ ప‌క్షాల‌న్నీ క‌లిసి మార్చుకోవాల‌న్న కేవీపీ మాట‌లు వింటే.. ఏపీ గురించి కాంగ్రెస్ ఎంత సీరియ‌స్ గా ఆలోచిస్తుంద‌న్న విష‌యం అర్థ‌మ‌వుతుంది. విభ‌జ‌న చ‌ట్టంలోని లోపాల్ని స‌వ‌రించుకునేందుకు చంద్ర‌బాబు త‌న పార్టీ ఎంపీలు.. కేంద్ర‌మంత్రుల‌తో క‌లిసి ముందుక‌దు రావాల‌ని కేవీపీ కోర‌టం గ‌మనార్హం.

ఏపీ ప్ర‌యోజ‌నాల కోసం తాను ఎంత క‌ష్ట‌మైనా ప‌డ‌తాన‌ని.. ఎంత‌వ‌ర‌కైనా పోరాడ‌తాన‌ని చెప్పే చంద్ర‌బాబు.. హోదా అంశంపై కాంగ్రెస్ చేస్తున్న సానుకూల ప్ర‌క‌ట‌నల మీద ఎందుకు రియాక్ట్ కావ‌టం లేదు?  తెలంగాణ రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు త‌ప్పించి త‌న‌కు మ‌రేమీ ప‌ట్ట‌ద‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తూ.. అచ్చం అలానే ఉండే కేసీఆర్ మాదిరి చంద్ర‌బాబు ఎందుకు వ్య‌వ‌హ‌రించ‌టం లేదన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. ఓప‌క్క హోదాకు మేం పూర్తిస్థాయిలో అనుకూల‌మ‌ని కాంగ్రెస్ తో స‌హా.. యూపీఏ భాగ‌స్వామ్య ప‌క్షాల‌న్నీ సిద్ధంగా ఉన్న‌ప్పుడు.. హోదా సాధ‌న‌కు ఇంత‌కు మించిన మంచి అవ‌కాశం ఉండ‌దు క‌దా? ఇలాంట‌ప్పుడు ఏపీ ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల‌కు త‌గ్గ‌ట్లుగా బాబు ఎందుకు నిర్ణ‌యం తీసుకోన‌ట్లు?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News