వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ నిర్ణయాలపై కొత్త చర్చ మొదలైంది. జగన్ ఇటీవల తీసుకుంటున్న నిర్ణయాలు మెచ్యూరిటీని చూపిస్తున్నాయని అంటున్నారు. ఉప ఎన్నికలకు సిద్ధమవడం, పార్టీలో నేతలను చేర్చుకోవడం వంటి అంశాల్లో జగన్ తీరులో ఎంతో పరిణితి కనిపిస్తోందని పలువురు విశ్లేషిస్తున్నారు. ఈ నిర్ణయాల వెనుక సీనియర్ నేత సూచనలు ఉంటాయని విశ్లేషిస్తున్న పలువురు...ఆ సీనియర్ మరెవో కాదు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మగా పేరున్న ఎంపీ కేవీపీ రామచంద్రరావు అంటున్నారు.
జగన్ నిర్ణయాల విషయంలో కేవీపీ సలహాలు ఉన్నాయనే కామెంట్ల వెనుక కారణాన్ని సైతం పలువురు ఆసక్తికరంగా విశ్లేషిస్తున్నారు. కొద్దికాలం క్రితం ఓ ఇంటర్వ్యూలో కేవీపీ రామచంద్రరావు మాట్లాడుతూ జగన్ తన మేనల్లుడి లాంటి వ్యక్తి అని అన్నారు. అయితే ఆ తదుపరి పరిణామాల్లో ఇటు జగన్ అటు కేవీపీ కానీ ఎక్కడా కలుసుకోలేదు, ముఖాముఖీ చర్చించుకోలేదు. అయినప్పటికీ వీరిద్దరి మధ్య సఖ్యత ఉందంటున్నారు. ప్రస్తుతం వార్తల్లో నలుగతున్న నంద్యాల ఉప ఎన్నిక విషయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం కేవీపీ సలహా ఫలితమే అంటున్నారు. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా ఉన్న శిల్పామోహన్ రెడ్డి వైసీపీలో తీసుకోవడం విషయంలో జగన్ ఆచితూచి అడుగువేసేలా కేవీపీ చూశారని, ఫలితాలను దృష్టిలో ఉంచుకోవాలని సూచించారని అంటున్నారు.
కేవీపీ వంటి రాజకీయ నిపుణుల సూచనలు, వ్యూహాల విశ్లేషణలను పరిగణనలోకి తీసుకున్న జగన్ ఈ క్రమంలోనే శిల్పాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ప్రకారం జగన్ సీనియర్ల మాటకు విలువ ఇస్తూ ముందకు సాగుతున్నారని వివరించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/