తెలుగుదేశం పార్టీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై కొత్త చర్చ తెరమీదకు వచ్చింది. ఇన్నాళ్లు చంద్రబాబును వ్యక్తిగతంగా ఎవ్వరూ ద్వేషించకపోయే వారు. పార్టీపరంగా జరిగే పరిణామాలు... పరిపాలనపరమైన లోపాలు ఏమైనా ఉంటే వాటిని మాత్రమే ఎత్తిచూపేవారు. అయితే ఇపుడు చంద్రబాబు ఆరోగ్యం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ చర్చను రాజేసింది కూడా ఎవరో ఆషామాషీ వ్యక్తి కాకపోవడం గమనార్హం.
కేవీపీ రామచంద్రరావు... వైఎస్ ఆత్మగా పేరున్న ఈ రాజ్యసభ సభ్యుడు మాట్లాడే సందర్భాలు చాలా చాలా తక్కువగా ఉంటాయి. అలా మాట్లాడిన సమయంలో కూడా తనకు చెందిన సబ్జెక్ట్ వరకే పరిమితం అవుతుంటారు. అలాంటి కేవీపీ తాజాగా చంద్రబాబు ఆరోగ్యంపై సందేహాలు రేకెత్తించారు. అమరావతి నిర్మాణం గురించి కేంద్రానికి ఫిర్యాదుచేసిన విషయం మీడియాకు వెళ్లడిస్తున్న సందర్భంగా చంద్రబాబుకు ఆల్జీమర్స్ ఉందని కేవీపీ ప్రకటించి సంచలనం రేపారు. ఈ విషయం బాబు సన్నిహితులే తనకు చెప్పారని...ఆల్జీమర్స్ వల్ల బాబు చేస్తున్న పనులు మర్చిపోతే భవిష్యత్ లో ఏపీకి పెద్ద సమస్య వచ్చిపడుతుందని కేవీపీ బాంబు పేల్చారు.
ఆషామాషీగా మాట్లాడటం అలవాటు లేని కేవీపీ చంద్రబాబు సన్నిహితులను ఉటంకిస్తూ మరీ ఆయనకు ఆల్జీమర్స్ ఉందని...మతిమరుపుతో రాష్ర్టానికి సమస్య అని చెప్పడం అంటే..సీరియస్‌గా తీసుకోవాల్సిన విషయమే అని పొలిటికల్ సర్కిల్ లో టాక్ నడుస్తోంది. కేవీపీ చేసిన ఆరోపణలను అటుంచితే ఇంతకు చంద్రబాబుకు సంబంధించిన వ్యక్తిగత విషయాన్ని ఆయన రాజకీయ ప్రత్యర్థి ఆత్మ అయిన కేవీపీకి చేరవేసిన వ్యక్తి ఎవరనేది భేతాళ ప్రశ్నగా మిగిలిపోయింది. ఇంతకూ ఆ వ్యక్తి ఎవరో మరి?