బాబుకు వైఎస్ ఆత్మ‌..ఘాటైన లేఖ సార‌మిదే!

Update: 2017-08-14 08:08 GMT
`2018 నాటికి పోల‌వ‌రం పూర్తిచేస్తాం. పోల‌వ‌రం నిర్మాణం నా క‌ల‌` అంటూ ఏపీ సీఎం చంద్ర‌బాబు ప‌దేప‌దే చెబుతూ ఉంటారు. అందుకే వారంలో ఒక‌రోజు పోల‌వ‌రం ప‌నుల‌పై స‌మీక్ష నిర్వ‌హిస్తూ ఉంటారు. ఇదే స‌మ‌యంలో కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, ఎంపీ కేవీపీ రామ‌చంద్ర‌రావు.. సీఎం చంద్ర‌బాబుకు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చారు.  రెండేళ్ల‌లో పోల‌వ‌రం ప్రాజెక్టు పూర్తిచేస్తే సీఎం చంద్ర‌బాబుకు.. `భార‌త‌ర‌త్న‌` ఇవ్వాల‌ని కోరుతూ తానే స్వ‌యంగా అంద‌రి మ‌ద్ద‌తు కూడ‌గడ‌తాన‌ని, `అప‌ర భ‌గీరథుడు` అనే బిరుదు కూడా ఇప్పిస్తానంటూ  సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పోల‌వరం ప్రాజెక్టుపై వాస్త‌వాల‌ను వివ‌రిస్తూ ఆయ‌న చంద్ర‌బాబుకు ఘాటైన‌ బ‌హిరంగ లేఖ రాయ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

పోల‌వ‌రం ప్రాజెక్టు ఏపీ జీవ‌నాడి అని సీఎం ప‌దేప‌దే చెబుతున్నారు. పోల‌వరం వాస్త‌వాల‌ను వివ‌రిస్తూ కేవీపీ రాసిన లేఖ‌.. చంద్ర‌బాబుకు శ‌రాఘాతంలా మారింది. అద్భుతాలు జరిగితే తప్ప 2019 నాటికి పోలవరం ప్రధాన డ్యామ్ పూర్తయ్యే అవకాశమేలేదని కేవీపీ స్ప‌ష్టంచేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కేంద్ర జల సంఘం అనుమతించిన డిజైన్ మేరకు ప్రాజెక్టు పూర్తిచేసి కుడి - ఎడమ కాలువల నుంచి గ్రావిటీద్వారా నీటిని ఇవ్వడం అసాధ్యమని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకుంటున్నట్లు రుజువు చేస్తే తాను రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తాన‌ని స‌వాలు విసిరారు. కాపర్‌ డ్యాంను ప్రధాన డ్యాంగా చూపుతూ ప్రజల్ని మభ్యపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదంతా చూస్తుంటే చంద్రబాబు వైస్రాయ్‌ నాటకాలు గుర్తుకొస్తున్నాయని కేవీపీ విమర్శించారు. ఏడు ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేస్తేనే సీఎంగా ప్రమాణం స్వీకరిస్తానని షరతుపెట్టి.. దాన్ని సాధించిన ఘనత తనదేనని చంద్ర‌బాబు గొప్పగా చెప్పుకొంటున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం జూన్ 2న ఏర్పడుతున్నందున ముంపుమండలాల విలీన ప్రక్రియ ఆ లోపే పూర్తి కావాలని, లేదంటే ఆ తర్వాత న్యాయపరమైన చిక్కులు ఏర్పడతాయన్న ఆందోళనను వ్యక్తం చేశామని, ఇదంతా చంద్రబాబు సమక్షంలోనే జరిగిందని కేవీపీ గుర్తుచేశారు.
Tags:    

Similar News