మరి కొద్ది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతోన్న నేపథ్యంలో ఏపీలో ప్రధాన పార్టీలు ఆరోపణలు - ప్రత్యారోపణలతో రాజకీయ వేడి పుట్టిస్తున్నాయి. ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకునే ఉద్దేశం లేకపోవడంతో ఆ పార్టీని టార్గెట్ చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే టీడీపీని టార్గెట్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు ఓ డాక్యుమెంటరీని రూపొందించారు. ఆ డాక్యుమెంటరనీని నేడు విజయవాడలో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ కీలక నేతల సమావేశంలో ప్రదర్శించారు. అయితే, అనూహ్యంగా ఆ వీడియోపై కాంగ్రెస్ పెద్దలు అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. టీడీపీని టార్గెట్ చేసి...కాంగ్రెస్ కు లబ్ధి చేకూర్చేలా ఆ డాక్యుమెంటరీ లేదని, కేవలం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును వ్యక్తిగతంగా టార్గెట్ చేసేలా ఉందని వారు కేవీపీపై బాహాటంగానే అసంతృప్తిని వెళ్లగక్కనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేతల తీరుతో కేవీపీ ఖంగు తిన్నట్లు తెలుస్తోంది.
ఎస్సీ ఎస్టీల అభివృద్ధిపై కాంగ్రెస్ నేతలు నేడు విజయవాడలో సమావేశం నిర్వహించారు. ఆ సమావేశానికి మాజీ కేంద్రమంత్రి జేడీ శీలం - ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి ఊమెన్ చాందీ - పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి హాజరయ్యారు. ఆ సమావేశంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఓ వీడియోను కేవీపీ ప్రదర్శించారు. దీంతో, ఆ వీడియోపై జేడీ శీలంతో పాటు మిగతా నేతలు బాహాటంగా అసంతృప్తి వెళ్లగక్కారట. ఏకపక్షంగా ఆ వీడియో ఉందని, టీడీపీని టార్గెట్ చేసి కాంగ్రెస్ కు లబ్ధి చేకూర్చేలా లేదని వారు అన్నారట. పోలవరంలో అవకతవకలు - హోదాపై బాబు వైఖరి వంటి అంశాలతో పాటు బాబును వ్యక్తిగతంగా టార్గెట్ చేసేలా ఆ వీడియో ఉందట. అయితే, ఈ పరిణామాన్ని ఊహించని కేవీపీ ఖంగుతిన్నారని తెలుస్తోంది.