తెలంగాణ రాష్ట్ర సమితిని ఓ రకంగా తెలంగాణ టీడీపీ అనవచ్చేమో.. ఎందుకంటే ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి మొదలుకొని మంత్రులు ఎర్రబెల్లి, గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాసయాదవ్, సీనియర్లు కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు, సహా చాలా మంది టీడీపీ నుంచి వచ్చిన వారే. అందుకే రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ ను సైతం టీడీపీయేనని ఇటీవల విమర్శించారు. ఈ జాబితాలోకి తాజాగా తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కూడా వచ్చి చేరాడు.
తెలంగాణ టీడీపీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి ఎల్.రమణ సోమవారం తెలంగాణ రాష్ట్రసమితిలో చేరారు. తెలంగాణ భవన్ లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ చేతులమీదుగా టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా రమణకు గులాబీ కండువా వేసి పార్టీలోకి కేటీఆర్ ఆహ్వానించారు. కేటీఆర్ చేతుల మీదుగా ఎల్.రమణ టీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారు.
ఈ సందర్భంగా రమణకు మంత్రి కేటీఆర్ తోపాటు పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రులు గంగుల, కొప్పుల, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఇక రమణ అధికారికంగా తన అనచరులు, టీడీపీ నేతలు, కార్యకర్తలతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఈనెల 16న టీఆర్ఎస్ లో లాంఛనంగా చేరుతారు. ఈ సభను తెలంగాణ భవన్ లో లేదా కరీంనగర్ లో నిర్వహించనున్నట్టు తెలిసింది.
తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు ఎల్.రమణ పార్టీకి ఇటీవలే తెలుగుదేశం గుడ్ బై చెప్పారు. టీడీపీ అధ్యక్ష పదవితోపాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజానామా చేసేశారు. తన రాజీనామా లేఖను చంద్రబాబుకు ఎల్.రమణ పంపారు. టీఆర్ఎస్ నుంచి బీసీ అయిన ఈటల రాజేందర్ వెళ్లిపోయారు. ఇప్పుడా స్థానంలోకి అదే బీసీ, చేనేత వర్గానికి చెందిన ఎల్.రమణను తీసుకురావాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారు. ఈ మేరకు మంత్రి ఎర్రబెల్లితో కలిసి ప్రగతి భవన్ కు తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణను రప్పించారు. అయితే చర్చలు ముగిసి టీఆర్ఎస్ లో చేరికకు ఎల్.రమణ ఒప్పుకున్నారు.
సామాజిక తెలంగాణ కోసం ముందుకు వెళ్లాలని కేసీఆర్ చెప్పారని.. తనతోపాటు కలిసి రావాలని కేసీఆర్ కోరినట్లు ఎల్.రమణ నిన్న చెప్పారు. టీఆర్ఎస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించారని తెలిపారు. దీనికి సానుకూలంగా నిర్ణయం ఉంటుందని కేసీఆర్ కు చెప్పానని ఎల్.రమణ మీడియాకు వివరించారు. ఈ క్రమంలోనే టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరేందుకు ఎల్. రమణ రెడీ అయ్యారు. 30 ఏళ్లుగా తన ఎదుగుదలకు తోడ్పాటునందించిన చంద్రబాబుకు ఈ సందర్భంగా రమణ కృతజ్ఞతలు తెలుపడం విశేషం. తనను నాయకుడిని చేసిన చంద్రబాబును పార్టీ వీడుతూ కూడా రమణ స్మరించుకున్నారు.
రమణ ఎగ్జిట్ తో తెలంగాణ రాజకీయాల నుంచి పూర్తిగా తెలుగుదేశం పార్టీ కనుమరుగు అయ్యే ప్రమాదంలో పడింది. తెలంగాణ టీడీపీ చీఫ్ ఎల్.రమణ టీఆర్ఎస్ లో చేరేందుకు డిసైడ్ అయిపోయారు. ఇటీవలే టీడీపీకి రాజీనామా చేసేశారు. రేపు టీఆర్ఎస్ లో చేరి సభ్యత్వం తీసుకోనున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎల్.రమణ పలు మార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ కన్వీనర్ గా, మంత్రిగా పనిచేశారు. గత కొంతకాలంగా టీఆర్ఎస్ తోపాటు బీజేపీ నేతలు ఎల్. రమణతో చర్చలు జరుపుతున్నారు. అయితే అధికార టీఆర్ఎస్ వైపే వెళ్లడానికి ఎల్. రమణ డిసైడ్ అయ్యారు.