తెలంగాణ టీడీపీలో కీలక నేతగా ఉంటూ టీఆరెస్ లో చేరిన పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు... తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ ఇంటికి వెళ్లి నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా మంతనాలు జరపడం రెండు పార్టీల్లోనూ హాట్ టాపిగ్గా మారింది. ఎర్రబెల్లి మళ్లీ టీడీపీలోకి వస్తున్నారని కొందరు అంటుంటే.. కాదు.. కాదు.. రమణను కారెక్కించేందుకు ఎర్రబెల్లి సంప్రదింపుల కోసం వచ్చారని మరికొందరు అంటున్నారు. మొత్తానికి ఈ ఇద్దరి భేటీ తరువాత ఎవరు ఏ పార్టీలో చేరుతారన్న ప్రశ్న మొదలైంది.
గత సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా తరఫున పోటీచేసి ఆ తర్వాత తెరాసలో చేరిన ఎర్రబెల్లి బుధవారం రాత్రి 7 గంటల సమయంలో రమణ నివాసానికి వెళ్ళారని - ఆయనతో సుదీర్ఘ మంతనాలు జరిపినట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. గురువారం వెలగపూడిలో తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో తెలంగాణ పార్టీ నేతలు సమావేశమైనప్పుడు కూడా ఈ అంశం ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. తెరాసలో చేరిన దయాకర్ రావుకు ఆ పార్టీలో ఏమాత్రం ప్రాధాన్యత లభించకపోవడంతో తిరిగి సొంత గూటికిలోకి చేరేందుకే రమణతో భేటీ అయి ఉండొచ్చని తెదేపా వర్గాలు భావిస్తున్నాయి. అయితే.. తెదేపాలో మరో అనుమానం కూడా వినిపిస్తోంది. రమణను తెరాసలోకి ఆహ్వానించేందుకే ఆ పార్టీకి చెందిన అగ్రనేతలు దయాకర్‌రావును సంప్రదింపులకు పంపించి ఉంటారన్న ప్రచారం జరుగుతోంది.
ఇటీవలి కాలంలో రమణ వ్యవహరిస్తున్న తీరుపై తెదేపాలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ఉద్యమంలో జరిగిన ఓ సంఘటనకు సంబంధించి నమోదైన కేసు విచారణకు రమణతో పాటు ఎర్రబెల్లి, ఇతర పార్టీ నేతలు హాజరయ్యారు. హైదరాబాద్ నుంచి ఒకే వాహనంలో ఈ ఇరువురు నేతలు ఆదిలాబాద్‌కు వెళ్ళడం కూడా అప్పట్లో చర్చనీయాంశమైంది. జిహెచ్ ఎంసి ఎన్నికలు ముగిశాక తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ తో పాటు మరికొంత మంది తెరాస ముఖ్య నేతలు కరీంనగర్ లోని ఓ రహస్య ప్రాంతంలో ఎల్.రమణను కలిసి తమ పార్టీలో చేరాలని ఆహ్వానించినట్టు అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. తెరాసలో చేరితే కేబినెట్ హోదాకు సమానమైన పదవిని ఇవ్వడంతో పాటు పార్టీలో కీలక బాధ్యతలను అప్పగించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని రమణకు ఈటల భరోసా ఇచ్చినట్టు సమాచారం. తెదేపాలో తాను అధ్యక్షుడిగా ఉన్నానని, ఇంతకన్నా పెద్ద పదవి ఏముంటుందని అప్పట్లో రమణ చెప్పినట్టు ప్రచారం జరిగింది.
తెలంగాణాలో ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ బలోపేతంగా ఉండడం, వెనకబడిన తరగతి వర్గాలకు చెందిన నాయకులు, ముఖ్య నేతలు ఆ పార్టీనే అంటిపెట్టుకుని ఉండడంతో ఎలాగైనా సరే వచ్చే ఎన్నికల నాటికి కీలకమైన నేతలను తమవైపు లాక్కోవాలన్న భావనతో తెరాస ఉన్నట్టు చెబుతున్నారు. అందులో భాగంగానే ఎర్రబెల్లిని సంప్రదింపుల కోసం రమణ చెంతకు పంపించి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/