మహిళా ఐటీ ఉద్యోగులు మగాళ్లురా బుజ్జీ..

Update: 2015-09-10 07:19 GMT
ఆడవారి వయసు.. మగవారి జీతం అడక్కూడదంటారు... కానీ ఐటీ రంగంలో పనిచేస్తున్న పురుషులు తమ జీతాలను గర్వంగా చెబుతుంటారు... కానీ... ఇప్పుడు మాత్రం ఆ పరిస్తితి లేదట... ముఖ్యంగా అదే రంగంలో ఉన్న ఆడవారి ముందు మాత్రం తమ జీతం ఎంతో అడగొద్దు అంటున్నారు. దీనికి కారణం ఉంది... ఐటీ రంగంలో మగాళ్ళకన్నా మహిళా ఉద్యోగులే ఎక్కువ జీతాలు తీసుకుంటున్నారట ఈమధ్య ... దేశమంతా ఇదే ధోరణి నడుస్తుందట ఇప్పుడు.

ఇక హైదరాబాద్‌ విషయానికొస్తే లో మహిళా సాఫ్టువేర్ ఇంజనీర్ల జీతాలు ఏడాదికి రూ. 9.7 లక్షలైతే మగాళ్ళ వేతనాలు రూ.9.4 లక్షలేనట. ఢిల్లీలో మహిళా సాఫ్టువేర్ ఇంజనీర్ల  జీతాలు సంవత్సరానికి రూ. 9.8 లక్షలైతే ఆ రంగంలోని మగవారు  రూ. 9.5 లక్షలు మాత్రమే సంపాదిస్తున్నారని ఓ సర్వేలో తేలింది. అయితే... ఇందులో ఓ ట్విస్టు కూడా ఉంది. జాబ్‌ లో చేరిన మూడేళ్ళలోనే ఫిమేల్ టెక్కీల జీతాలు పెరుగుతున్నాయి... కానీ... నాలుగేళ్లు అయిన తరువాత మాత్రం వారికంటే మగవారి జీతాలు పెరుగుతున్నాయట. ముంబై - చెన్నై - బెంగుళూరు నగరాల్లోనూ తేడాలున్నాయట. అయితే హైదరాబాద్‌ లో బ్యాంకింగ్ - ఫైనాన్సు రంగాల్లో మహిళా - పురుష ఉద్యోగుల జీతాలు దాదాపు ఒకేలా ఉన్నాయట.
Tags:    

Similar News