ఆసక్తికర భేటీ ఒకటి చోటు చేసుకుంది. రాష్ట్ర విభజన జరిగితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి మరీ రాజకీయాలకు దూరమయ్యారు విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి. తరచూ పలువురు ముఖ్యనేతలతో భేటీ అవుతూ రాజకీయంగా హాట్ టాపిక్ గా మారే ఆయన.. తాజాగా ఏపీ విపక్ష నేత.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు.
ఈ నెల 25న లగడపాటి కుమారుడి వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో పెళ్లి పత్రికను జగన్‌కు ఇవ్వటానికి లగడపాటి ఆయన వద్దకు వచ్చారు. ఈ నెల 6 నుంచి తాను పాదయాత్రప్రారంభించనున్న నేపథ్యంలో పెళ్లికి హాజరు కావటం సాధ్యం కాదని లగడపాటికి జగన్ చెప్పేసినట్లుగా చెబుతున్నారు.
దాదాపుగా అరగంట పాటు వీరిద్దరి మధ్య సమావేశం జరిగినట్లుగా తెలుస్తోంది. ఇటీవల కాలంలో చోటు చేసుకున్న రాజకీయాంశాల గురించిన చర్చజరిగినట్లుగా సమాచారం. జగన్ త్వరలో చేపట్టనున్న పాదయాత్ర గురించి వివరాల్ని జగన్‌ను అడిగి తెలుసుకున్నట్లుగా చెబుతున్నారు.
పాదయాత్ర సందర్భంగా నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వచ్చిన రెస్పాన్స్ గురించిన వివరాల్ని జగన్‌కు లడగపాటి అందజేసినట్లుగా తెలుస్తోంది. పాదయాత్రతో ఫలితం తప్పనిసరిగా ఉంటుందని.. ప్రజల్లో ఆదరణ పెరగటం ఖాయమన్న మాటను జగన్‌కు చెప్పినట్లుగా సమాచారం. లగడపాటి మాటల్ని జగన్ శ్రద్ధగా ఆలకించినట్లుగా చెబుతున్నారు. సమకాలీన రాజకీయాలతో పాటు.. రానున్న సార్వత్రిక ఎన్నికలు ఏ విధంగా జరగనున్నాయి? అన్న అంశంపై లగడపాటి తనకున్న సమాచారాన్ని వైఎస్ జగన్ తో పంచుకున్నట్లుగా చెబుతున్నారు. లగడపాటి చెప్పిన వివరాల్ని జగన్ సావధానంగా విన్నట్లుగా తెలుస్తోంది. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసిన సమయంలో ఆయన వెంట ఉన్న వారిలో లగడపాటి ఒకరన్న సంగతి తెలిసిందే. ఏమైనా.. జగన్ పాదయాత్ర కారణంగా పెరిగే మైలేజీ గురించి లగడపాటి చెప్పిన సమాచారాన్ని వినే విషయంలో ఆసక్తిని ప్రదర్శించినట్లుగా తెలుస్తోంది.