తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సతీమణి నందమూరి లక్ష్మీపార్వతికి ఏపీలోని వైసీపీ ప్రభుత్వం కీలక పదవి అప్పగించింది. లక్ష్మీపార్వతిని ఏపీ తెలుగు అకాడమీ చైర్ పర్సన్ గా నియమిస్తూ జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
చాలాకాలంగా వైసీపీలో ఉన్న లక్ష్మీపార్వతికి జగన్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఏదో ఒక పదవి దక్కుతుందని అంతా అనుకున్నారు. అయితే.. ఆర్నెళ్లవుతున్నా ఇంతవరకు ఆమెకు ఏ పదవీ ఇవ్వకపోవడంతో విమర్శలూ వచ్చాయి. అయితే, కాస్త ఆలస్యమైన ఆమెకు తగిన పదవి ఇచ్చారన్న వాదనను వైసీపీ వర్గాలు వినిపిస్తున్నాయి.
ఉన్నత విద్యావంతురాలు, సాహిత్యంతో మంచి పరిచయం ఉన్న లక్ష్మీపార్వతికి తెలుగు అకాడమీ పదవి ఇవ్వడం సరైనదేనని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వైసీపీలో మహిళా నేతలు రోజా, వాసిరెడ్డి పద్మలకు కూడా ఇప్పటికే కీలక పదవులు ఇచ్చారు. రోజాకు ఏపీఐఐసీ చైర్ పర్సన్‌గా, వాసిరెడ్డి పద్మను మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా నియమించారు. ఇప్పుడు లక్ష్మీపార్వతికి కూడా ముఖ్యమైన పదవి ఇచ్చారు.
రోజా, వాసిరెడ్డి పద్మల్లా లక్ష్మీపార్వతి నిత్యం వైసీపీ తరఫున మాట్లాడేవారు కాదు. కానీ.. సమయానుకూలంగా స్పందిస్తూ పార్టీ తరఫున మాట్లాడుతూ ఉపయోగపడేవారు. పైగా ఆమె పదవులు కావాలని, ఎన్నికల్లో పోటీ చేస్తానని కూడా ఎన్నడూ అడగలేదని కూడా వైసీపీ వర్గాలు చెబుతున్నారు. ఆ కారణంగానే ఆమెకు కీలక పదవి అప్పగించారని చెబుతున్నారు.