అల్లుడిపై ల‌క్ష్మీపార్వ‌తి సెటైర్ అదిరిపోయిందిగా!

Update: 2017-08-23 04:29 GMT
టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడుకు వెన్నుపోటు వెన్న‌తో పెట్టిన విద్యేన‌ట‌. ఇదేదో చంద్ర‌బాబుకు బ‌ద్ద శ‌త్రువులో - లేక‌పోతే అస‌లు ఆయ‌న కుటుంబంతో ఎలాంటి సంబంధం లేని వారో చెప్పిన మాట కాదు. స్వ‌యానా ఆయ‌న‌కు పిల్ల‌నిచ్చిన మామ దివంగ‌త ఎన్టీఆర్‌కు రెండో భార్య అయిన ల‌క్ష్మీపార్వ‌తి అన్న మాట‌. ల‌క్ష్మీ పార్వ‌తి కూడా విప‌క్షం వైసీపీలోనే కొన‌సాగుతున్నారు క‌దా... ఆమె విప‌క్ష పార్టీకి చెందిన నేత కాబ‌ట్టే... చంద్ర‌బాబుపై ఆమె అలాంటి వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని అనుకుందామ‌నుకున్నా... అస‌లు టీడీపీ నుంచి ఎవ‌రు ఎవ‌రిని వెళ్ల‌గొట్టారు అన్న విష‌యాన్ని ఓ ద‌ఫా ఆలోచిస్తే... అస‌లు విష‌యం తేలుతుంద‌ని వాదించే వ‌ర్గాలు కూడా ఇప్పుడు చాలానే ఉన్నాయి. ఈ రెండు వాద‌న‌లు ఎలా ఉన్నా...  త‌న‌కు, త‌న భ‌ర్త ఎన్టీఆర్‌ కు తీర‌ని అన్యాయం చేయ‌డమే కాకుండా... త‌న భర్త చేతుల క‌ష్టం మీద అందిన అధికారాన్ని లాగేసుకున్నార‌న్న ఆవేద‌న‌తో చంద్రబాబుపై ల‌క్ష్మీపార్వ‌తి ఆది నుంచి కూడా అంతెత్తున ఎగిరిప‌డుతున్న విష‌యం తెలిసిందే.

ఇటీవ‌ల పెద్ద‌గా బ‌య‌ట‌కు రాలేక‌పోతున్న ల‌క్ష్మీపార్వ‌తి... నిన్న కాకినాడ వ‌చ్చారు. ఈ సందర్భంగా కాకినాడ‌లోని వైసీపీ కార్యాయ‌లంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆమె పార్టీ నేత‌ల‌తో క‌లిసి చాలా విష‌యాలు మాట్లాడారు. త‌మ చేతిలోని అధికారాన్ని లాగేసుకున్నార‌ని చంద్ర‌బాబుపై ఆమె మ‌రోమారు విరుచుకుప‌డ్డారు. పిల్ల‌నివ్వ‌డమే కాకుండా... రాజ‌కీయాల్లో పైకి తీసుకొచ్చిన త‌న భ‌ర్త ఎన్టీఆర్‌ ను చంద్ర‌బాబు న‌ట్టేట ముంచేశార‌ని ఆమె ఆరోపించారు. నాడు ఎన్టీఆర్‌ ను మోసం చేసి అధికారాన్ని లాగేసుకున్న చంద్ర‌బాబు ఇప్పుడు రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను కూడా మోసం చేస్తున్నార‌ని ఆమె వ్యాఖ్యానించారు.

నాడు ఎన్టీఆర్‌ కు, నేడు రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు వెన్నుపోటు పొడుస్తున్న చంద్ర‌బాబుకు ఆ విద్య వెన్న‌తో పెట్టిన‌దేన‌ని కూడా ఎద్దేవా చేశారు. తొమ్మిదేళ్ల పాటు ఉమ్మ‌డి రాష్ట్రాన్ని పాలించిన చంద్ర‌బాబు దుర్మార్గాల‌ను భ‌రించ‌లేకే... ప్ర‌జ‌లు ఆయ‌న‌ను ప‌దేళ్ల పాటు విప‌క్షంలో కూర్చోబెట్టిన వైనాన్ని ఈ సంద‌ర్భంగా ల‌క్ష్మీపార్వ‌తి గుర్తు చేశారు. ఇప్పుడు అధికారం చేప‌ట్టిన చంద్ర‌బాబు... మూడేళ్లు కూడా గ‌డ‌వ‌కుండానే నాటి పాల‌న కంటే దిగ‌జారిపోయింద‌ని ఆమె ఆరోపించారు. చంద్ర‌బాబు పాల‌న‌లో ఆయ‌న సొంత కంపెనీ హెరిటేజ్ ఆస్తుల‌తో పాటు దోపిడీ - అవినీతి మాత్ర‌మే పెరిగిపోయాయ‌ని, మిగిలిన ఏ ఒక్క రంగంలోనూ రాష్ట్రం అభివృద్ధి సాధించ‌లేద‌ని కూడా ఆమె సెటైర్లు వేశారు. అత్త వేసిన సెటైర్ల‌కు అల్లుడి నుంచి ఎలాంటి రిప్లై వ‌స్తుందో చూడాలి.
Tags:    

Similar News