సెటైరిక్ ప్రసంగాలకు - సెటైరిక్ వాగ్బాణాలకు కేరాఫ్ అడ్రెస్... బీహార్ మాజీ సీఎం - ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్. ఇటీవల బీహార్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఎలాగూ తనకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అనుమతి లేదని ఎంతమాత్రం బాధపడని ఆయన తన ఇద్దరు కుమారులను బరిలోకి దింపేశారు. దింపడంతోనే ఆయన సరిపెట్టుకోలేదు... ఇద్దరు కుమారులను అధికార పీఠం ఎక్కించేందుకు పక్కాగానే ప్రణాళికలు రచించారు. ఇందులో భాగంగా... విజయావకాశాలు మెండుగా ఉన్న ఆ రాష్ట్రానికి అప్పటికే పదేళ్ల పాటుగా సీఎంగా కొనసాగుతున్న నితీశ్ కుమార్ ఆధ్వర్యంలోని జేడీయూ, గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కూటమితో జట్టు కట్టారు.
ఎన్నికల్లో బీజేపీ కూటమికి ఎదురెళ్లిన ఈ కూటమి విజయం సాధించింది. ఇంకేముంది... నితీశ్ ముచ్చటగా మూడో పర్యాయం సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించగా - లాలూ ప్రసాద్ చిన్న కుమారుడు తేజస్వీ యాదవ్ డిప్యూటీ సీఎంగా - పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్... నితీశ్ కేబినెట్ లో కీలక శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అయితే నితీశ్ తో కుదిరిన పొత్తు లాలూకు పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి. అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిన లాలూ ఫ్యామిలీ... తాజాగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ - సీబీఐ - ఆదాయపన్ను శాఖ మూకుమ్మడిగా రంగంలోకి దిగిపోవడంతో మరింతగా ఇబ్బందుల పాలైందని చెప్పాలి. ఈ దెబ్బకు నితీశ్ కేబినెట్ నుంచి తేజస్వీతో పాటు తేజ్ ప్రతాప్ కూడా పదవులకు దూరమవ్వాల్సి వచ్చింది.
ఆ తర్వాత నితీశ్ తీసుకున్న సింగిల్ నిర్ణయంతో నిన్నటిదాకా ఆయనకు మిత్రుడిగా ఉన్న లాలూ... ఇప్పుడు నితీశ్ కు దాదాపు శత్రువుగా మారిపోయారు. పొత్తు ధర్మాన్ని అవమానించి బీజేపీతో జేడీయూ చేతులు కలపడాన్ని లాలూ దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ క్రమంలో నిన్న జరిగిన నరేంద్ర మోదీ కేబినెట్ పునర్వవస్థీకరణలో జేడీయూకు రెండు నుంచి మూడు మంత్రి పదవులు దక్కనున్నాయని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నిన్న ఉదయం జరిగిన కేబినెట్ విస్తరణలో జేడీయూ ఊసే వినిపించలేదు. దీంతో ఇదే అదను అనుకున్న లాలూ వెనువెంటనే రంగంలోకి దిగిపోయారు.
తనను, తన కుటుంబాన్ని నట్టేట ముంచేశారన్న భావనతో నితీశ్ పై కాలిపోతున్న లాలూ... మోదీ చేతిలో నితీశ్ కు జరగాల్సింది జరిగిపోయిందన్న చందంగా సెటైరిక్ తూటాలను గురి చూసి కొట్టారు. కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు కొందరు జేడీయూ నేతలు కొత్త బట్టలు కూడా కుట్టించుకున్నారని, కానీ వారి ఆశలు అడియాసలయ్యాయని ఆయన తనదైన శైలిలో కామెంట్ చేశారు. నితీశ్ కుమార్ వ్యక్తిత్వం గురించి ప్రధాని మోదీకి, అమిత్ షాకు చాలా బాగా తెలుసని, ఈ కారణంగా జేడీయూను మంత్రివర్గంలోకి తీసుకోలేదని ఆయన విమర్శించారు. పునర్వ్యవస్థీకరణ గురించి ప్రధాని మోదీ తమతో ఒక్క మాటైనా చెప్పలేదని నితీశ్ కుమార్ తెగ బాధపడిపోతున్నారని లాలూ వ్యాఖ్యానించారు.