టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమమహేశ్వర రావు మరో వివాదంలో చిక్కుకున్నారు. విజయవాడలోని దుర్గాపురంలో ఎమ్మెల్యే ఉమా అనుచరులమని పేర్కొంటూ ఓ ఇంటిని ఆక్రమించుకున్నారని వార్తలు వెలువడుతున్నాయి. దుర్గాపురంలో ఓ ఇంటి యజమానురాలు భర్త చనిపోవటంతో కుమార్తెతో కలిసి ఆ ఇంట్లో ఉంటోంది. బుధవారం కొందరు వ్యక్తులు ఆమె వద్దకు వచ్చి ఇంటి నుంచి బలవంతంగా బయటకు పంపించారు. వారు తమను తాము ఎమ్మెల్యే బోండా ఉమా అనుచరులుగా చెప్పుకొని సదరు మహిళను ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆ వ్యక్తులు తమను హెచ్చరించినట్లు సదరు మహిళ వాపోయింది. ఏమైనా మాట్లాడుకోవాల్సి ఉంటే ఎమ్మెల్యే ఆఫీసుకు రావాలని, అక్కడే సెటిల్ మెంట్ జరుగుతుందని వార్నింగ్ ఇచ్చినట్లు ఆమె తెలిపింది.
ఎమ్మెల్యే మనుషులు తమను ఇంట్లోకి రానివ్వకపోవడంతో క్యాన్సర్ తో బాధపడుతున్న తన కూతురుతో కలిసి రాత్రంతా ఇంటి బయటే నిరీక్షించానని ఆ వితంతువురాలు వాపోయింది. తమపై సదరు వ్యక్తులు తీవ్ర బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపింది. తన కుమార్తెకు ఏమైనా జరిగితే ఎమ్మెల్యే బోండా ఉమా బాధ్యత వహించాలని ఆమె డిమాండ్ చేసింది. కాగా ఈ వార్త కలకలం రేకెత్తించింది. సదరు బాధితురాలు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/