ఏపీ అసెంబ్లీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ రావు కుమార్తె విజయలక్ష్మి పై భూకబ్జా కేసు నమోదైంది. ఆమెపై వచ్చిన ఈ అభియోగాలపై దర్యాప్తు చేయాలని గుంటూరు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గుంటూరు పట్టణానికి చెందిన శివలక్ష్మి అనే మహిళ గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శాంతకుమార్ ద్వారా కోర్టులో ఈ ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదు వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు పట్టణానికి చెందిన శివలక్ష్మి కి గుంటూరు సమీపంలో 2.28 ఎకరాల స్థలం ఉంది. దానిని కోడెల కుమార్తె డాక్టర్ విజయలక్ష్మి ఆక్రమించి...తన కుమారుడిని కిడ్నాప్ చేసి..తమ కుటుంబాన్ని బెదిరించి నల్లపాడు రిజిస్ర్టేషన్ కార్యాలయంలో రిజిస్టర్ చేయించారని శివలక్ష్మి ఆరోపిస్తున్నారు. రౌడీలతో దౌర్జన్యం చేయించి బంగారం, నగదు కూడా తీసుకెళ్లినట్టు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఫిర్యాదును పరిశీలించిన గుంటూరు మెజిస్ర్టేట్ గుంటూరు రూరల్ పోలీసులను ఈ కేసు విచారించాలని ఆదేశించారు. శివలక్ష్మి ఫిర్యాదు ప్రకారం ప్రస్తుతం విచారణ జరుగుతోంది. అయితే దీనిపై కోడెల కుమార్తె డాక్టర్ విజయలక్ష్మి స్పందన ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా ఉంది.
తనకు సంబంధం లేకుండా ఉన్న ఆస్తిని ఆమె ఎలా ఆక్రమిస్తారని చర్చలు జరుగుతున్నాయి. ఏదైనా స్పీకర్ కుమార్తె పై ఇలాంటి ఆరోపణలు రావడం కాస్త ఇబ్బందికర విషయమే.