ఎంపీలు సార్‌.. ఇదేనా మ‌న నాలెడ్జ్‌? వైసీపీలో గుస‌గుస‌

Update: 2022-02-05 02:30 GMT
వైసీపీ పార్ల‌మెంటు స‌భ్యుల తెలివితేట‌ల‌కు సంబంధించి ఆ పార్టీలోనే ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ``ప‌రువు పోతోంది ఎంపీలు.. సార్‌!!`` అంటూ.. కొంద‌రు నాయ‌కులు కామెంట్లు చేస్తున్నారు.. మ‌రికొంద‌రు.. ఇదేనా మ‌న నాలెడ్జ్‌! అంటూ.. ఎద్దేవా చేస్తున్నారు. ఎందుకంటే... ఎంపీలు.. ఏదో సాధించ‌లేద‌ని కాదు.. లేక పోతే.. రాష్ట్రానికి ఏమీ చేయ‌లేద‌ని కూడా కాదు!  దేశం ముందు... ఏపీ ప‌రువు పోతోంద‌నేది వీరి ఆవేద‌న. నిజా నికి  చెప్పాలంటే... ఇది వీరి ఒక్క‌రి ఆవేద‌నే కాదు.. దాదాపు అన్ని ప‌క్షాల వారిదీ ఇలానే ఉంది.

దీనికి కార‌ణం.. ప్ర‌స్తుతం పార్ల‌మెంటు స‌మావేశాలు జ‌రుగుతున్నాయి. వైసీపీ ఎంపీలు.. ఏపీకి సంబంధిం చిన అనేక అంశాల‌ను ఎక్కువ‌గా ప్ర‌స్తావిస్తున్నారు. ఎందుకంటే.. ఇప్ప‌టికే దాదాపు మూడేళ్లు గ‌డిచిపోతు న్నాయ‌ని.. అయిన‌ప్ప‌టికీ.. ఏపీకి సంబందించిన అంశాలపై వీరు స‌రిగా మాట్లాడ‌డం లేద‌ని పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. దీంతో సీఎం జ‌గ‌న్ కూడా ఇటీవ‌ల ఎంపీల‌కు క్లాస్ తీసుకున్నారు. స‌మ‌స్య‌లు ప్ర‌స్తావించండి.. అవి ప‌రిష్కారం అవుతాయో లేదో . త‌ర్వాత‌! అని సీఎం చెప్పారు.

దీంతో ఎంపీలు ప్ర‌శ్నించ‌డం.. ప్రారంభించారు. అయితే.. ఇక్క‌డ ప్ర‌ధానంగా వారు చేస్తున్న త‌ప్పు ఏంటంటే.. వారు మాట్లాడుతున్న భాషే! కేంద్రాన్ని ఇంగ్లీష్‌లో ప్ర‌శ్నిస్తున్నా... లేక విష‌యాన్ని ఇంగ్లీష్‌లో చెబుతున్నా... ఎల్ కే జీ స్టూడెంట్లు గుర్తుకు వ‌స్తున్నారు. `వెన్ను.. వాట్టు.. ఉడ్డు.. ` అంటూ.. క‌నీసం జ్ఞానం కూడా లేకుండా.. ఇంగ్లీష్‌లో మాట్లాడుతుంటే.. ప‌క్క‌నున్న పొరుగు రాష్ట్రాల ఎంపీలు ముసిముసిగా న‌వ్వుకుంటున్నారు. నిజానికి వైసీపీకి ఉన్న ఎంపీల్లో ఎక్కువ మంది బాగానే చ‌దువుకున్న వారు ఉన్నారు.

మార్గాని భ‌ర‌త్‌, గోరంట్ల మాధ‌వ్‌, మిధున్ రెడ్డి, త‌లారి రంగ‌య్య‌, బాల శౌరి వంటివారు పోస్టు గ్రాడ్యుయేట్లు. ఇక‌, మిగిలిన వారిలోనూ బాగాన‌నే చ‌దువుకున్న వారు ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ.. వీరు ఇంగ్లీషులో మాట్లాడుతుంటే.. విన‌లేని ప‌రిస్థితి వ‌స్తోంది. పొరుగు రాష్ట్రాల‌కు చ‌చెందిన మ‌హిళా ఎంపీలు సైతం.. ఇంగ్లీష్‌లో దంచి కొడుతుంటే.. మ‌న ఏపీకి చెందిన వారు మాత్రం క‌నీసం మాట్లాడ‌లేక పోవ‌డం.. సిగ్గుగా ఉంద‌ని సొంత పార్టీలోనే గుస‌గుస వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఇప్ప‌టికైనా.. నాలెడ్జ్ పెంచుకుంటారో లేదో చూడాలి.
Tags:    

Similar News