మొత్తానికి ఏపీకి క్యాపిట‌ల్ క‌న్ఫార్మ్ అయింది!

Update: 2022-03-30 11:32 GMT
ఓ రాష్ట్రానికి.. ఓ దేశానికి రాజ‌ధాని ఎంతో అవ‌స‌రం. పాల‌న వ్య‌వ‌హారాలు సాగాల‌న్నా ప్ర‌భుత్వం న‌డ‌వాల‌న్నా రాజ‌ధాని కావాలి. కానీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని ఏదీ అంటే స‌మాధానం చెప్ప‌లేని ప‌రిస్థితి. గ‌త టీడీపీ ప్ర‌భుత్వం హ‌యాంలో మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తిని రాజ‌ధానిగా ప్ర‌క‌టించి అక్క‌డ అభివృద్ధి ప‌నులు మొద‌లెట్టారు. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత మూడు రాజ‌ధాన‌లంటూ అమ‌రావ‌తి ప‌నుల‌ను ఆపేశారు. ఇక ఇటీవ‌ల ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి అంటూ కోర్టు తీర్పు ఇచ్చినప్ప‌టికీ వైసీపీ మాత్రం మూడు రాజ‌ధానుల‌కే క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని చెబుతోంది. ఈ నేప‌థ్యంలో ఏపీ రాజ‌ధాని ఇదే అంటూ ప్ర‌జ‌లు మాట్లాడుకుంటున్నారు. క్యాపిట‌ల్ క‌న్ఫార్మ్ అయింద‌ని చెబుతున్నారు.

వ్యంగ్యంగా ఊహ‌ల్లో..

ఏపీ రాజ‌ధానిపై స్ప‌ష్ట‌త వ‌చ్చిందా? మ‌రి అది ఎక్క‌డ ఉంది? అని అడుగుతున్నారు. ఆ రాజ‌ధాని ఉంది కానీ క‌నిపించ‌దు. అవును.. ఏపీ క్యాపిట‌ల్ అనేది వ‌ర్చువ‌ల్ క్యాపిట‌ల్ అని అది ఉంటుంది కానీ క‌నిపించ‌ద‌ని ఐటీ ఉద్యోగులు వ్యంగ్యంగా మాట్లాడుకుంటున్నారు. రాజ‌ధాని లేని రాష్ట్రంల ఏపీ అంటూ ప‌రువు పోయేలా వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని తెలిసింది. ఇప్పుడు ఏపీ ప్ర‌జ‌లు త‌మ రాజ‌ధాని ఏదీ అంటే స‌మాధానం ఇవ్వ‌లేని ప‌రిస్థితి ఉంది. మేధావులు, చ‌దువుకున్న వాళ్లు, ఐటీ ఉద్యోగులు, ప్ర‌భుత్వ ఉద్యోగులు.. ఇలా అంద‌రి ప‌రిస్థితి ఇలాగే ఉంది.

అందుకే వెట‌కారంగా..

ఈ నేప‌థ్యంలో ఏపీ రాజ‌ధానిపై వ్యంగ్యాస్త్రాలు, వెట‌కార‌పు వ్యాఖ్య‌లు ఎక్కువ‌య్యాయ‌ని ఏపీ ప్ర‌జ‌లు బాధ‌ప‌డుతున్నారు. తాజాగా హైద‌రాబాద్ మెట్రోలో కొంత‌మంది ఐటీ ఉద్యోగులు ఏపీ రాజ‌ధానిపై వ్యంగ్యంగా మాట్లాడుకున్నారు. ఏపీకి రాజ‌ధాని క‌న్ఫార్మ్ అయింద‌ని ఆ ఉద్యోగులు అది బ్రేకింగ్ న్యూస్ లాగా మాట్లాడుకుంటున్నారు. ఇంత‌లో ఓ పెద్ద మ‌నిషి వెళ్లి.. ఎక్క‌డ ఉంది ఆ రాజ‌ధాని అని అడిగారంటా. అది ఎక్క‌డుందో త‌మ‌కు తెలుసని ఆ ఉద్యోగులు చెప్తే ఎక్కడుందో చెప్పాల‌ని ఆ పెద్ద‌మ‌నిషి కోరారు.

క‌రోనా లాక్‌డౌన్ కార‌ణంగా ఐటీ రంగంలో వ‌ర్చువ‌ల్ విభాగానికి డిమాండ్ పెరిగింది. ఎక్క‌డో ఉంటూ ప‌ని చేసుకోవ‌చ్చు.. ఏ కార్య‌క్ర‌మంలోనైనా పాల్గొన‌వ‌చ్చు. అది క్షేత్ర‌స్థాయిలో జ‌ర‌గ‌కున్నా జ‌రిగిన‌ట్లు చూపించొచ్చు. ఇప్పుడు ఏపీ రాజ‌ధాని కూడా అలాగే వ‌ర్చువ‌ల్ క్యాపిట‌ల్‌గా ఉంద‌ని ఆ ఉద్యోగులు న‌వ్వుకున్నారు. ఇలా ఏపీ ప్ర‌జ‌ల ప‌రువు పోయేలా మాట్లాడే అవ‌కాశం ఇచ్చిన ప్ర‌భుత్వంపై జ‌నాలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ముందుగా ఏపీ రాజ‌ధాని విష‌యాన్ని తేల్చాల‌ని డిమాండ్ చేస్తున్నారు.
Tags:    

Similar News