కొత్త జిల్లాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యేలు, మంత్రుల నుంచి వచ్చిన అభ్యంతరాలు సీఎం పరిశీలించారు. ఈ నెల 31న కొత్త జిల్లాల తుది నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, ప్రణాళికావిభాగం కార్యదర్శి, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి తదితర అధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు. ఇప్పటి వరకూ ఎమ్మెల్యేలు, మంత్రులు నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించారు.
ఇప్పటి వరకూ 9 వేలకు పైగా ప్రజలు, ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల్లో ఇప్పటికే కొన్ని పరిష్క రించామని అధికారులు.. సీఎంకు వివరించినట్టు తెలుస్తోంది. పేర్లు మార్చాలని, రెవెన్యూ డివిజన్లను మార్చాలని కోరుతూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నుంచి వచ్చిన అభ్యంతరాలు, సూచనలపై సీఎం చర్చించినట్టు సమాచారం. మరోవైపు జిల్లాల విభజనకు సంబంధించి క్షేత్రస్థాయిలో చేసిన మార్పులపైనా సీఎస్.. ముఖ్యమంత్రికి వివరించినట్టు తెలుస్తోంది.
దాదాపు గంటన్నరపాటు ముఖ్యమంత్రి దీనిపై సమీక్షించారు. మార్చి 31 తేదీన కొత్త జిల్లాల తుది నోటిఫికే షన్ను జారీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే.. ముఖ్యంగా సీఎం జగన్ సొంత జిల్లా కడపలోనే కొత్త జిల్లాల ఏర్పాటుపై తీవ్ర వివాదం రాజుకుంది. రాయచోటి కేంద్రం అన్నమయ్య జిల్లాను ఏర్పాటు చేయడాన్ని ఇక్కడి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాజంపేట కేంద్రంగా ఈ జిల్లా ఏర్పాటు చేయాలని.. అనేక మంది రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలిపారు. వీరిలో ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి కూడా ఉన్నారు.
మరోవైపు.. రాయచోటిలో జగన్‌కు అత్యంత కీలక సన్నిహితుడు.. ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ వివాదం పరిష్కరించడం.. జగన్‌కు కత్తిమీద సాములానే ఉంది. పైగా సెంటిమెంటును గౌరవించకపోతే.. సొంత జిల్లాలోనే వ్యతిరేకత పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈజిల్లాపై ఏం చేస్తారనేది ఆసక్తిగా మారింది. మరోవైపు చిత్తూరులో మదన పల్లెను ప్రత్యేక జిల్లాగా చేయాలని డిమాండ్లు వస్తున్నారు. ఇంకోపక్క నరసాపురం కేంద్రంగా నరసాపురం జిల్లా ఏర్పాటు కు కూడా డిమాండ్లు వస్తున్నాయి. ఈ మూడు విషయాలు ఇప్పుడు జగన్‌కు అత్యంత ముఖ్యంగా మారుతున్నాయి. మరి ఏం చేస్తారో చూడాలి.