పొరుగు రాష్ట్రాల అధికారులతో కేసీఆర్ కు చిక్కులు తప్పవా?

Update: 2023-01-13 06:50 GMT
పొరుగింటి పుల్లకూర కోసం ఆశపడ్డ కేసీఆర్ కు భంగపాటు ఎదురవుతోంది. ఇప్పటికే ఏపీ క్యాడర్ కు కేటాయించిన సోమేష్ కుమార్ ను ఏరికోరి మరీ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని చేశారు కేసీఆర్. తెలంగాణలో ఇంతమంది ఉండగా.. ఈ బీహారిని చేయడంపై ఉద్యమించిన ఉద్యోగులు ఎంతో మంది విమర్శలు చేశారు. ఇక డీజీపీ కూడా తెలంగాణకు చెందిన వ్యక్తి కాదు. ఆయన కూడా ఏపీ క్యాడర్ ఐఏఎస్ నే. ఇతర రాష్ట్రాలకు చెందిన వారే. ఇలా మన క్యాడర్ కాని వారిని.. మన రాష్ట్రానికి చెందని వారిని కేసీఆర్ నెత్తిన పెట్టుకోవడంపై విమర్శలు వచ్చాయి. సొంత అధికారులను కేసీఆర్ ప్రభుత్వం పక్కనపెట్టిందన్న అపవాదు మొదలైంది.

ఈ క్రమంలోనే హైకోర్టు తీర్పుతో తెలంగాణ సీఎస్ గా ఉన్న సోమేష్ కుమార్ ఏపీకి వెళ్లిపోయారు. ఇక డీజీపీ అంజనీ కుమార్ కూడా లైన్లో ఉన్నారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో కేసీఆర్ సర్కార్ కు గడ్డుకాలం తప్పదని అంటున్నారు. స్టేట్ కేడర్ ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లను పక్కనపెట్టేసి.. పొరుగు రాష్ట్రాల ఆఫీసర్లకు సర్కార్ పట్టం కట్టించింది. వారికే కీలకమైన శాఖలు కట్టబెట్టిందన్న విమర్శ ఉంది.

ఇంతకాలం కీలక హోదాలో పనిచేసిన ఏపీ క్యాడర్ ఆఫీసర్లను తమ సొంత రాష్ట్రానికి పంపించేందుకు కేంద్రం సిద్ధమైంది. దీంతో తెలంగాణ కేడర్ లో చాలా మంది ఆపీసర్లు ఉన్న ప్రయోజనం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకాలం వారిని అప్రాధాన్య లూప్ లైన్ లో పెట్టడంతో అనుభవం లేకుండా పోయిందనే చర్చ సాగుతోంది.

తెలంగాణలో ఇతర రాష్ట్రాల కేడర్ ల ఐఏఎస్ లు తిష్టవేసి కేసీఆర్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని కక్షగట్టిన కేంద్రంలోని బీజేపీ వారందరినీ సాగనంపడానికి రెడీ అయ్యింది. ఇక నుంచి కఠినంా ఉండాలని నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. రూల్స్ ఉల్లంఘించే వారిపై యాక్షన్ తీసుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

తెలంగాణలోని ఆలిండియా సర్వీస్ ఆఫీసర్ల వ్యవహార తీరుపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టు సమాచారం. వారికి కేటాయించిన రాష్ట్రం కాకుండా తమకు ఇష్టమైన చోట పనిచేసే అవకాశం లేదనే సంకేతాలను పంపేందుకు బీజేపీ రెడీ అవుతోంది. వారిపై వచ్చిన ఆరోపణలపై కేంద్ర నిఘా సంస్థలు ఆరాతీస్తున్నట్టు సమాచారం.

అందుకే అలెర్ట్ అయిన కేసీఆర్ ఇతర రాష్ట్రాల అధికారులను పంపించేసి తెలంగాణకు కేటాయించినా అనుకూలురైన వారి కోసం శూలశోధన చేపట్టినట్టు తెలుస్తోంది.
Tags:    

Similar News