మంత్రి వర్గ రేసులో తన పేరు ఉంటుందని... తనను ఖచ్చితంగా మంత్రిని చేస్తారని.. అనుకున్న నాయకుడు.. ఇప్పుడు దిగులు పెట్టుకున్నారట. ఎందుకంటే.. ఆయన పేరు కానీ.. ఆయన ఊసు కానీ.. మంత్రి వర్గ రేసులో ఎక్కడా కనిపించడం లేదు.. వినిపించడమూ లేదు.
దీనికి కారణం ఏంటి? అనేది .. ఆయనకు కూడా అంతు చిక్కడం లేదట! దీంతో ఇప్పుడు ఆయన అసలు రాజకీయాల్లో ఉన్నారా? లేరా.? అనే చర్చ కూడా జరుగుతోంది. ఆయనే కృష్నాజిల్లాకు చెందిన కీలక నాయకుడు.. మాజీ మంత్రి, బీసీ సామాజిక వర్గానికి చెందిన పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి.
గత 2014 ఎన్నికలకు ముందు.. వైసీపీలోకి వచ్చిన ఆయన.. మచిలీపట్నం ఎంపీగా అప్పట్లో టికెట్ తె చ్చుకున్నారు. అయితే.. టీడీపీ హవాతో ఆయన అప్పట్లో ఓడిపోయారు. వాస్తవానికి ఆయన అయిష్టంగానే.. మచిలీపట్నం నుంచి పోటీచేశారని అంటారు.
సరే.. గత ఎన్నికల్లో తిరిగి పట్టుబట్టి.. తన నియోజకవర్గాన్ని దక్కించుకున్నారు. వైసీపీ సునామీ.. తన హవాతో ఎట్టకేలకు.. పెనమలూరు నుంచి విజయం దక్కించుకున్నారు. ఈ క్రమంలోనే యాదవ కోటాలో.. తనకు మంత్రి పదవి దక్కుతుందని అనుకున్నారు. అయితే.. ఇది కాస్తా.. జగన్‌కు వీరవిధేయుడు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే.,. అనిల్‌కుమార్ యాదవ్ దక్కించుకున్నారు.
ఇక, అప్పటి నుంచి మళ్లీ జరిగే మంత్రి విస్తరణలో తనకు ఖచ్చితంగా పదవి దక్కుతుందని ఆశిస్తున్నారు. ఇక, ఇప్పుడు మంత్రి వర్గం విస్తరణ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. దీనిపై ఎంతో మంంది విశ్లేష ణలు చేస్తున్నారు. వీరికి పదవి దక్కుతుంది.. వారికి పదవి వస్తుందని అని చెబుతున్న పేర్లలో ఎక్కడా కొలుసు పేరు మాత్రం కనిపించడం లేదు. అదేసమయంలో పార్టీ వర్గాల్లోనూ ఆయన పేరు వినిపించడం లేదు. దీంతో ఇప్పటికే మంత్రి పదవి దక్కలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న ఆయన.. ఇప్పుడు మరింతగా దిగులు పెట్టుకున్నట్టు కనిపిస్తోంది.
అందుకే.. కొన్నాళ్లుగా ఎక్కడా కనిపించడం లేదు. నిజానికి కొన్నాళ్ల కిందటి వరకు ఆయన టీవీల్లో చర్చలకు వచ్చేవారు. పార్టీతరఫున వాయిస్ వినిపించేవారు. కానీ, మంత్రి విస్తరణ అంశం తెరమీదికి రావడం.. దానిలో తన పేరు ఎక్కడా కనిపించకపోవడం.. వినిపించకపోవడంతో సైలెంట్ అయిపోయారు. మరిదీనికి కారణం ఏంటి అంటే... మంత్రి అనిల్ కుమార్‌ను వదులుకునేందుకు.. జగన్ సిద్ధంగా లేరని తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఆయనను కొనసాగిస్తారని.. ఆ సామాజికవ ర్గంలో మార్పులు ఉండబోవని అంటున్నారు.