మేక‌పాటిని చూసి నేర్చుకోవాల్సిన‌వి చాలానే ఉన్నాయా..?

Update: 2022-02-23 13:30 GMT
వైసీపీ కీల‌క నాయ‌కుడిగా.. యువ  మంత్రిగా.. ప‌నిచేసిన మేక‌పాటి గౌతం రెడ్డి గురించి.. ఆయ‌న చ‌నిపో యిన త‌ర్వాత కానీ.. ఈ రాష్ట్రానికి ఆయ‌న‌లోని మంచిప‌నులు తెలియలేదు.

కేవ‌లం నెల్లూరు ప్ర‌జ‌ల‌కు లేదా.. ఒక వ‌ర్గం ప్ర‌జ‌ల‌కు మాత్ర‌మే ఆయ‌న ప‌రిమిత‌మ‌య్యారు. కానీ, చ‌నిపోయిన‌.. త‌ర్వాత‌.. ఆయ‌నపై ఎలాంటి ఆరోప‌ణ‌లు లేవ‌ని.. ఆయ‌న వివాద‌ర‌హితుడ‌ని.. మీడియా ఆకాశానికి ఎత్తేసింది. ఇది వాస్త‌వ‌మే. దీంతోనే రాష్ట్ర వ్యాప్తంగా.. గౌతం రెడ్డి గురించిన చ‌ర్చ జోరుగా సాగింది.

ఈ క్ర‌మంలోనే చాలా మంది ప్ర‌జ‌లు.. మేక‌పాటి మృతిపై తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

దీనికి కార‌ణం ఏంటి? ఎందుకు?  అంటే.. వైసీపీలో ఉన్న ఇత‌ర నేత‌ల‌కు భిన్నంగా ఆయ‌న వ్య‌వ‌హ‌రించ డ‌మే. నిజానికి మేక‌పాటి ఆగ‌ర్భ శ్రీమంతుడు. ఆయ‌న త‌న తండ్రి వార‌స‌త్వాన్ని పుణికి పుచ్చుకుని రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. అయిన‌ప్ప‌టికీ.. ఎక్కడా అహంకారం అనేది లేకుండా.. ఎవ‌రిపైనా దూష‌ణ‌లు చేయ‌కుండా.. నిర్మాణాత్మ‌క‌, క్రియాశీల రాజ‌కీయాలు చేశారు. అంతేకాదు.. త‌ను ఎంచుకున్న ప‌నిని పూర్తి చేయ‌డంలోనూ.. ఆయ‌న నిబద్ధ‌త‌తో వ్య‌వ‌హ‌రించారు. ఇప్పుడున్న చాలా మంది నాయ‌కుల‌కు ఇవి లేకుండా పోయాయ‌నేది ప్ర‌జ‌ల టాక్‌. అంతేకాదు.. ఆయ‌న‌ను చూసి చాలా నేర్చుకోవాల‌ని కూడా వారు అంటున్నారు.

ఏం చేసినా.. ప్ర‌జ‌ల కోసం.. పార్టీ కోసం.. ప్ర‌భుత్వం కోసం చేయాల‌నే దృష్టితో ఆయ‌న వ్య‌వ‌హ‌రించారు. అంతేత‌ప్ప‌.. సంచ‌నాల కోసం.. వివాదాల కోసం.. మీడియాలో ఉండేదుకు ఆయ‌న ఎప్పుడూ.. ఏదీ చేయ లేదు. ఇదే విష‌యాన్ని ప్ర‌జ‌లు కూడా ప్ర‌స్తావిస్తున్నారు. నేడు చాలా మంది ఎమ్మెల్యేలు. వివాదాల‌కు కేంద్రంగా మారుతున్నారు. కేవ‌లం ఏదో వివాదం చేస్తే త‌ప్ప త‌మ‌కు గుర్తింపు రాద‌ని.. మీడియా త‌మ‌కు.. చేరువ కాద‌ని.. వారు భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే గౌతంరెడ్డిని చూసి క‌న్నీరు పెట్టుకుంటున్న‌వారు..

ఆయ‌న లేర‌ని మీడియా ముందుకు వ‌చ్చి.. ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్న నేత‌లు.. ఆయ‌న‌ను చూసి చాలా నేర్చుకోవాల‌ని హిత‌వు ప‌లుకుతున్నారు. ముఖ్యంగా సౌమ్యం, అంద‌రినీ క‌లుపుకొని పోయే త‌త్వం.. ప్ర‌తిప‌క్షాల‌తో కూడా స్నేహంగా ఉండ‌డం. ఎన్నిక‌ల స‌మ‌యంలోనే రాజ‌కీయాలు చేయ‌డం.. అధిష్టానానికి విధేయులుగా ఉండ‌డం వంటివి గౌతంరెడ్డిలో ఉన్న విధేయ‌త‌ల‌కు మ‌చ్చుతున‌క‌లుగా పేర్కొంటున్నారు.
Tags:    

Similar News