అవంతి బాగా హర్ట్... ..పవన్ మీద హాట్ హాట్... ?

Update: 2022-03-15 06:29 GMT
పవన్ కళ్యాణ్ ఒక మాట అనలేదు. ఒక కామెంట్ చేయలేదు. ఆయన వైసీపీ మంత్రులను కొందరిని  ఎంచుకుని మరీ పంచుల మీద పంచులేశారు. అందరి కంటే ఎక్కువగా పంచుల దెబ్బ తగిలింది మంత్రి  అవంతి శ్రీనివాసరావుకే అని వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. అవంతిని పట్టుకుని బంతీ చేమంతీ పూబంతీ గోడకు కొట్టిన బంతీ అంటూ బాగా కుదిరిన  ప్రాసలతో పవన్ ఒక్క లెక్కన చెడుగుడు ఆడేశారు.

ఇలా  ఒకసారి కాదు మొత్తం స్పీచ్ లో కనీసం మూడు నాలుగు సార్లు అయినా అవంతి మీద ఇవే పంచులు పడ్డాయి. సభలో జన సైనికులు విరగబడి నవ్వారు కూడా.  దాంతో మంత్రి గారు ఊరుకుంటారా. ఆయన కూడా బాగానే రియాక్ట్ అయ్యారు. పవన్ కళ్యాణ్ కేవలం సినిమాల్లో మాత్రమే హీరో. అదే నేను మాత్రం పొలిటికల్ హీరో అంటూ రివర్స్ పంచులేశారు.

ఇక పవన్ కళ్యాణ్ కి ఎపుడూ ఎవరో  ఒకరు స్క్రిప్ట్ రాసి ఇస్తే మాత్రమే చదివే అలవాటు ఉంది. అంతకు మించి ఆయనకు రాజకీయం ఏం తెలుసు అంటూ ఎద్దేవా చేశారు. ఏపీకి కేవలం టూరిస్టుగా వచ్చీ పోయే పవన్ కి ఏపీ గురించి తెలిసింది ఏముందని కూడా గాలి తీసేశారు.

పవన్ టీడీపీతో పొత్తు ఎందుకు పెట్టుకున్నారు, ఎందుకు విడిపోయారు. ముందు దీనికి సమాధానం చెప్పాలని నిలదీశారు. అదే విధంగా బీజేపీతో పొత్తు వల్ల పవన్ ఏపీకి ఏమి సాధించగలిగారో కూడా ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.

పవన్ రాజకీయాల్లో వాస్తవాలు తెలుసుకోవాలని అవంతి హితబోధ చేశారు. విమర్శలు ఒకరి మీద చేయడం కాదు, ముందు రాష్ట్రం పట్ల రాజకీయం పట్ల అవగాహన పెంచుకోవాలని కూడా అవంతి సూచించారు. మొత్తానికి బంతీ చామంతీ కామెంట్స్ అవంతిని బాగానే హర్ట్ చేసినట్లున్నాయి.
Tags:    

Similar News